Nayanthara : నయన తార.. ఏం చేసినా అది హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. సినిమాలలో స్టార్ హీరోయిన్ గా రాజ్యమేలుతున్న ఈ బ్యూటీ.. సౌత్ లో ఏ హీరోయిన్ తీసుకోనటువంటి నెంబర్ ను రెమ్యూనరేషన్ గా తీసుకుంటోంది. అంతేకాకుండా లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మళయాళంలోనూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నటనలో ఎలాంటి క్యారెక్టర్స్ లో నైనా లీనమైపోయే ఈ అమ్మడు గత కొంతకాలంగా ప్రేమించిన డైరెక్టర్ విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.
జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ రెస్టారెంట్ లో చాలా సింపుల్ గా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల నడుమ విగ్నేశ్ చేత మూడు మూళ్లు వేయించుకుంది. అయితే విగ్నేష్ తో ప్రేమాయణానికి ముందు నయనతార కొరియోగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవాతోనూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. నయన్ వల్లే ప్రభుదేవా తన భార్యకు విడాకులు ఇచ్చాడని కోలీవుడ్ లో వార్తలు వినిపించాయి.
ఆ సమయంలో ప్రభుదేవా భార్య రమలత్ నయన్‌కు శాపనార్థాలు కూడా పెట్టింది. కట్ చేస్తే ప్రభుదేవా, నయనతార బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే ప్రభుదేవా.. నయనతార బ్రేకప్ చెప్పుకోవడానికి ప్రభుదేవా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని తెలుస్తోంది. ప్రభుదేవా పెళ్లి తరవాత సినిమాలు వద్దని చెప్పడంతో నయన్ ఓకే చెప్పిందట. ఆ తరవాత ప్రభుదేవా క్రిస్టియన్ గా ఉన్న నయన్ ను తన మతంలోకి మారాలని కోరగా అదికూడా సరే అందట నయనతార.
అలాగే నయనతార ఆస్తులు కొన్ని ప్రభుదేవా పేరుపై ట్రాన్స్‌ఫర్ కూడా చేసిందట. ఆ తరవాత ప్రభుదేవా ఆధిపత్యం చెలాయిస్తూ మరికొన్ని కండిషన్స్ పెట్టాడట. ఆ తర్వాత ప్రభుదేవా తీరులో మార్పు రావడంతో విసిగిపోయిన నయనతార చివరకు బ్రేకప్ చెప్పేసిందట. అలా ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పిన నయన్ ప్రస్తుతం విగ్నేష్ శివన్‌తో వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక ఏరికోరి చేసుకున్న విగ్నేష్ తో నయన్ ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…