Sudigali Sudheer : చెట్ల పొదల్లో అడ్డంగా దొరికిపోయిన హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్.. కానీ!

November 26, 2021 11:00 AM

Sudigali Sudheer : బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. సాధారణంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ వేదికపై ఉన్నారంటే ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ ఉంటారు.

Sudigali Sudheer and hyper aadi skit viral

ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి ఒక స్కిట్ లో భాగంగా చేసిన కామెడీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ స్కిట్ లో భాగంగా వీరిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరినే ప్రేమిస్తూ ఉంటారు. అయితే తనని కలుసుకోవడానికి ఇద్దరు ఒకే ప్రదేశంలోకి వెళ్తారు. ఇలా చెట్లపొదల మధ్య ఇద్దరు వారు ప్రేమిస్తున్న అమ్మాయి కోసం ఎదురుచూస్తుండగా చివరికి ఆ అమ్మాయి రావడంతో వీరిద్దరిని ఒకే చోట చూసి షాక్ అవుతుంది.

ఇక వారిద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిసి వారు వేసిన పంచ్ డైలాగులు అందరి చేత నవ్వులు తెప్పించాయి. మొత్తానికి ఓకే అమ్మాయి కోసం వీరిద్దరూ చెట్ల పొదల మధ్యలో దాక్కుని చివరికి అలా దొరికి పోవడంతో వారు చేసిన హంగామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. కాగా వారు చేసిన ఈ స్కిట్‌కు చెందిన వీడియో వైరల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now