SS Rajamouli : దాదాపుగా మూడు సంవత్సరాలు ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉన్న రాజమౌళి ఇప్పుడిప్పుడే కాస్త బయట కనిపిస్తున్నారు. తాజాగా ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో పాల్గొన్నారు. అక్కడ తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అయితే ఓ సందర్భంలో తనకు పైసా సంపాదన లేని సమయంలో తన భార్య రమా రాజమౌళి జీతం మీద బతికానని అన్నారు. అప్పుడు నా డ్యూటీ ఆమెను తీసుకెళ్లి, తీసుకు రావడం. ఖాళీ సమయంలో కథలు రాసుకోవడం.
నేను ఆమె సంపాదన మీద బ్రతికానని చెప్పడానికి ఏ మాత్రం సిగ్గులేదని రాజమౌళి పేర్కొన్నారు. ఇప్పుడు నా సినిమాలు ఫ్లాప్ అయి, పరిస్థితి బాగోలేకపోతే నా భార్యని జాబ్‌కి పంపించి, ఆమె జీతం మీదే బతుకుతాను అంటూ రాజమౌళి స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఆయన మాటలు వైరల్‌గా మారాయి. అప్పట్లో రాజమౌళికి దర్శకుడు కావాలనే తపన ఉన్నప్పటికీ, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఒక్కోసారి ఆత్మ విశ్వాసం సన్నగిల్లేది. నాన్న విజయేంద్ర ప్రసాద్ పరిశ్రమలో ఉండడం వలన, అన్ని క్రాఫ్ట్స్ లో పని చేసి, పట్టు సాధించానని, రాజమౌళి తెలియజేశారు.
రాజమౌళి ప్రతి సినిమాకు కుటుంబం మొత్తం పని చేస్తారు. సంగీత దర్శకుడిగా అన్న కీరవాణి చేస్తుండగా, వదిన వల్లి, భార్య రమా కాస్ట్యూమ్ డిజైనర్స్ గా, కొడుకు కార్తికేయ ప్రొడక్షన్.. ఇలా మొత్తం ఫ్యామిలీ మమేకం అవుతారు. ప్రతి విజయంలోనూ ఫ్యామిలీ అంతా ఉంటుంది. ఎంత ఎదిగినా కూడా వారు ఒదిగే ఉంటారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం జనవరి 7న విడుదల కానుండగా, ఈ సినిమా కోసం ప్రంపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…