Puneeth Rajkumar : కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఎంతో ఆరోగ్యంగా.. ఫిట్‌గా ఉండే పునీత్ ఆకస్మాత్తుగా మనందరినీ వదిలి వెళ్లిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయమం చేస్తున్న సమయంలో పునీత్‌కు ఛాతిలో నొప్పి వచ్చిందని, ఆ వెంటనే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా, ఆయన గుండెలో మార్పులు గమనించి వెంటనే విక్రమ్ ఆసుపత్రికి సమాచారం అందించారు.
విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పునీత్ రాజ్ కుమార్ తుది శ్వాస విడిచారని ఇప్పటికే డాక్టర్స్ వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఛాతిలో నొప్పి వచ్చినప్పుడు ఆసుపత్రికి వెళ్లేందుకు పునీత్.. వారి ఇంటి నుంచి కారు వరకు తానే స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ఎక్కినట్లుగా కనిపిస్తోంది. తనకేమీ కాలేదని ఎలాంటి నొప్పి లేదని తన భార్యతో చెప్పారు.
కారు ఎక్కిన వెంటనే భార్య ఒడిలో పునీత్ పడుకున్నారు.. ఇక ఆ తర్వాత.. ఐదు నిమిషాల ప్రయాణం అనంతరం విక్రమ్ ఆసుపత్రికి చేరిలోపు భార్య ఒడిలోనే పునీత్ కన్ను మూశారు. పునీత్ చివరి క్షణాలకు సంబంధించిన విజువల్స్ చూస్తే కళ్లు చెమ్మగిళ్లక మానవు. పునీత్ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిన విషయం తెలిసిందే.
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…