Hema Pragathi : హేమ‌కు ఒంటి మీద బ‌ట్ట‌ల్లేవు.. ప్ర‌గ‌తికి గంతులేసేందుకు తీరిక‌లేదు..

October 15, 2021 12:50 PM

Hema Pragathi : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేష‌న్ ఎన్నిక‌లు ఎంత రచ్చ‌గా మారాయో మ‌నం అంద‌రం చూశాం. ప్ర‌కాశ్ రాజ్, మంచు విష్ణు మ‌ధ్య హోరా హోరీగా ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా, ఒకరిపై ఒక‌రు మాట‌ల దాడులు చేసుకున్నారు. మ‌గాళ్ల‌తోపాటు ఆడవాళ్లు కూడా రెచ్చిపోయారు. అయితే ఈ ఎన్నిక‌లు జ‌రిగిన తీరుపై ప్ర‌ముఖుల‌తో పాటు శ్రీరెడ్డి కూడా త‌ప్పుబ‌ట్టింది. మూవీ ఆర్టిస్టులకు సేవ చేసేందుకుగాను మా ఎన్నికల్లో పాల్గొనపుడు సేవ చేయడం కోసం అంతగా పరితపించాల్సిన అవసరం ఏముందని శ్రీరెడ్డి ప్రశ్నించింది.

srireddy comments on Hema Pragathi over maa elections

తాను గతంలో ఓ పని చేసినప్పుడు అంత పబ్లిసిటీ అవసరమా అని అడిగిన వారు ఇప్పుడు చేసిందేమిటి ? అని అన్నది. ఇకపోతే మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎలక్ట్ అయినపుడు మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను బట్టి ఆయన మనసులో ఏదో ఉందని ఆరోపించింది. చిరంజీవికి విష్ణు మా అధ్యక్షుడు కావడం ఇష్టం లేదని తెలిపింది.

మా ఎల‌క్ష‌న్స్ రోజున హేమ ఒంటి మీద బ‌ట్ట‌లు ఎక్కుడున్నాయో కూడా తెలియ‌ద‌ని పేర్కొంది. ప్ర‌గ‌తి అలా గంతులేయాల్సిన అవ‌స‌రం లేదంటూ పేర్కొంది శ్రీ రెడ్డి. నాలుగు లేదా ఐదు పెళ్లిళ్లు చేసుకున్న వాళ్లు కరెక్ట్ పర్సన్స్ కాదన్న సంగతిని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న వారు దేశ సేవకు పనికిరారని పేర్కొంది. ఇప్పటికైనా ప్రజలు కళ్లు తెరవాలని హితబోధ చేసింది శ్రీరెడ్డి. మీ జీవిత లక్ష్యాలను రీచ్ కావాలని, అలా చేసి మీ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వండని సూచించింది. అయితే.. శ్రీరెడ్డి చేసిన నాలుగు పెళ్లిళ్ల కామెంట్ పరోక్షంగా జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించే చేసిందని.. పలువురు అంటున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now