గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pragathi : ఆ స్టార్ హీరోతో గడిపితే ఛాన్స్ ఇస్తామన్నారు.. న‌టి ప్ర‌గ‌తి కామెంట్స్‌పై దుమారం..

Pragathi : ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఒక భూతంలా మారింది. సినీ ప్రపంచం అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. మీ టూ ఉద్యమంతో పలువురు సెలబ్రిటీలు…

Pragathi : ఆ స్టార్ హీరోతో గడిపితే ఛాన్స్ ఇస్తామన్నారు.. న‌టి ప్ర‌గ‌తి కామెంట్స్‌పై దుమారం..

Pragathi : ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఒక భూతంలా మారింది. సినీ ప్రపంచం అనేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి అక్కడ ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ అనే పదం వినిపిస్తూ ఉంటుంది. మీ టూ ఉద్యమంతో పలువురు సెలబ్రిటీలు తాము కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు చెబుతూ ఉంటారు. స్టార్ హీరోయిన్స్ దగ్గర నుండి జూనియర్ ఆర్టిస్ట్ ల వరకూ కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం సీనియర్ నటి ప్రగతి కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడ్డాను అంటూ సంచలన విషయాల‌ను వెల్లడించింది. ఒక హీరో వలన ఆమె పడిన ఇబ్బందుల‌ను ఓ ఇంటర్వ్యూ ద్వారా బయట పెట్టింది.

సీనియర్ నటి ప్రగతి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి నటన పరంగా తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా ఒదిగిపోయే నటి ప్రగతి. అత్తగా, తల్లిగా, భార్యగా అనేక పాత్రలలో తెలుగుతోపాటు తమిళ భాషల్లో కూడా దాదాపు 100కు పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. రీసెంట్ గా F3 చిత్రంలో నటించి తన కామెడీ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాదు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. ఆమె లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో అప్డేట్ చేస్తూ అభిమానులకు ఎంతో దగ్గరగా ఉంటుంది. 50 ఏళ్లు దాటినా జిమ్ లో వర్కవుట్ లు చేస్తూ తన అందచందాలు చూపిస్తూ వీడియోలను అప్‌లోడ్ చేస్తుంది. ఒక్కోసారి ప్రగతి వస్త్రధారణ వివాదాలకు దారితీస్తుంది. తన డ్యాన్స్ వీడియోలతో కుర్రాళ్ళ మతులు పోగొడుతుంది.

Pragathi sensational comments on a star hero at her career beginning
Pragathi

అసలు విషయంలోకి వెళ్తే..  ప్రగతి కెరీర్ ప్రారంభంలో క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడినట్టు ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేసింది. దర్శక నిర్మాతలు మాత్రమే కాకుండా ఓ స్టార్ హీరో కూడా తనను రోజంతా గడపమన్నాడు అని వేదన వ్యక్తం చేసింది. తనతో గడిపితేనే సినిమాలో నటించే అవకాశం ఇస్తా అని చెప్పాడని తెలిపారు ప్రగతి. తాను మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఇలా చాలా మంది ఫీమేల్ ఆర్టిస్ట్ లు క్యాస్టింగ్ కౌచ్ అనే భూతంతో ఇబ్బంది పడుతున్నారని తెలియజేసింది. కానీ ఆ హీరో, నిర్మాతలు ఎవరు.. అనే అసలు పేర్లు మాత్రం బయటపెట్టలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి