Srikanth : ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జగపతిబాబు ఒకరు. ఈయన ఎన్నో కుటుంబ కథా చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ తర్వాత హీరోగా పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన లెజెండ్ సినిమా ద్వారా జితేంద్ర అనే పాత్రలో విలన్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
లెజెండ్ సినిమా తర్వాత జగపతిబాబుకు వరుస అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన హీరోగా కంటే విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. ఇక ఈయన మాదిరిగానే ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ కూడా జగపతిబాబు బాటలోనే పయనిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ తాజాగా విలన్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా శ్రీకాంత్ విలన్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఇప్పటి వరకూ ఆయన పాత్ర ఏంటి.. అనే విషయం ఎవరికీ తెలియక పోయినప్పటికీ తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ట్రైలర్ లో శ్రీకాంత్ చెప్పే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఒక గొప్ప విలన్ గా సక్సెస్ అవుతారా.. జగపతిబాబులాగే విలన్ క్యారెక్టర్లు ఆయనకు వస్తాయా.. వాటిల్లో ఆయన నటిస్తారా.. అన్న వివరాలు వేచి చూస్తే తెలుస్తాయి.
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్‌గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్‌కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…
టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ప్రేరణాత్మక…