Shahid Kapoor : సినిమా కోసం మన హీరోలు చాలా రిస్క్‌లే చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రమాదానికి ఎదురెళుతుంటారు. తాజాగా ఓ హీరో సినిమా కోసం తన పెదవిని గాయపరచుకున్నాడు. దీని వలన పాతిక కుట్లు పడ్డాయట. వివరాలలోకి వెళితే.. షాహిద్ కపూర్ కథానాయకుడిగా టాలీవుడ్ బ్లాక్ బస్టర్ `జెర్సీ`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ పై హిందీలో నిర్మిస్తున్నారు. మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి ఈ రీమేక్ ని డైరెక్ట్ చేస్తున్నారు.
హిందీ ‘జెర్సీ’ సినిమా కోసం క్రికెట్ సాధన చేస్తూ తాను తీవ్రంగా గాయపడినట్లు షాహిద్‌కపూర్ పేర్కొన్నారు. కింది పెదవికి బాల్ బలంగా తాకడంతో 25 కుట్లు పడ్డాయని ఆయన చెప్పారు. చిత్రంలో జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలని తపించే క్రికెటర్‌గా షాహిద్‌కపూర్ నటిస్తున్నారు. ‘క్రికెటర్ పాత్ర కోసం సన్నద్ధమవుతున్న సమయంలో ఓ రోజు బాల్ బలంగా తాకడంతో నా కింది పెదవి చిట్లింది.
25 కుట్లు పడ్డాయి. ఈ గాయం వల్ల నా పెదవి ఎప్పటికీ పనిచేయదని భయపడ్డా. కదిలించడమే కష్టమైంది. కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఈ ప్రమాదం కారణంగా రెండు నెలల పాటు షూటింగ్‌ను ఆపివేశాం’ అని గుర్తుచేసుకున్నాడు. ఇది క్రికెట్ నేపథ్యంలో సినిమా కావడంతో చాలా సాహసాలే చేయాల్సి వచ్చిందన్న విషయాన్ని షాహిద్ కపూర్ తాజాగా వెల్లడించాడు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…