Sania Mirza : టెన్నిస్‌లో అంతర్జాతీయ స్టార్‌గా సానియా మీర్జా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. పలు టైటిల్స్‌ను కూడా సాధించింది. అయితే ఇటీవల ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఏడాది తనకు చివరిదని తెలియజేసింది. అయితే రిటైర్మెంట్ ఎందుకు తీసుకుంటుందో తాజాగా ఆమె వివరించింది. ఈ మేరకు ఆమె ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించింది.
తనకు ప్రస్తుతం 35 సంవత్సరాలని.. అంతేకాకుండా తనకు మూడు పెద్ద సర్జరీలు జరిగాయని సానియా మీర్జా తెలిపింది. ఈ క్రమంలో ఫిట్‌నెస్ కోసం చాలా శ్రమించాల్సి వస్తుందని పేర్కొంది. రెండు సార్లు తన మోకాలికి, ఒకసారి మణికట్టుకు సర్జరీలు జరిగాయని తెలియజేసింది. ఈ క్రమంలోనే తన శరీరం ప్రస్తుతం సహకరించడం లేదని తెలిపింది.
అలాగే తనకు 3 ఏళ్ల కొడుకు ఉన్నాడని, అతన్ని చూసుకోవడంతోపాటు శరీరం తిరిగి కోలుకునేందుకు కొంత సమయం పడుతుందని తెలిపింది. అందుకనే రిటైర్మెంట్ ప్రకటించానని చెప్పుకొచ్చింది. అయితే తన రిటైర్మెంట్ నిర్ణయం ఎంతో మందిని బాధించిందని, చాలా మంది తనకు మెసేజ్ చేశారని.. ఈ ఏడాది చివరి వరకు ఆడేందుకు ప్రయత్నిస్తానని ఆమె తెలిపింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…