Samantha : నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత సమంత తన దృష్టిని పూర్తిగా సినిమాలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. విడాకుల ప్రకటన ఆనంతరం ఆ బాధ నుంచి బయట పడేందుకు ఆమె తీర్థ యాత్రలు, పర్యటనలతో బిజీగా మారింది. మరోవైపు వరుస సినిమాలకు సైన్ చేస్తోంది. ఇప్పటికే ఆమె శాకుంతలంలో నటించగా, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాత్తు వాక్కుల రెండు కాదల్’ సినిమాలో నటిస్తోంది.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన కూడా వెలువడింది. సామ్ బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతోందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు ప్రముఖ నటి తాప్సీ పన్ను నిర్మాణంలో సామ్ ఓ ప్రాజెక్ట్ చేయబోతుందని, దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలిసారి పుష్ప కోసం ఐటెం గర్ల్ గా కూడా మారబోతోంది. నాలుగు నిమిషాల కోసం కోటిన్నర రూపాయలు వసూలు చేయనుందట.
సమంత రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలు తీసుకుంటుందని అంటున్నారు. ఒకేసారి సమంత అంత రెమ్యునరేషన్ పెంచేయడంతో నిర్మాతలు ఖంగు తింటున్నారు. కొందరు నిర్మాతలు అంత మొత్తం ఇచ్చి ఆమెతో సినిమాలు చేయడానికి రెడీగా కూడా ఉన్నారట. ఏదేమైనా సమంత సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా ఉందని తెలుస్తోంది.
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…