Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటు సౌత్, అటు నార్త్ ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు సల్మాన్. బాలీవుడ్ బ్రహ్మచారిగా ఉన్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్ళి చేసుకోకపోయినా.. తనకంటే వయసులో చాలా చిన్నదైన హీరోయిన్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడు. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్ .. 41 ఏళ్ల లులియా వాంటూర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నాడు. ప్రస్తుతం సోలో లైఫ్‌ని సంతోషంగా గడుపుతున్నాడు.అయితే ఐదు పదుల వయస్సులోనూ చాలా హ్యాండ్సమ్‌గా ఉంటూ కుర్ర హీరోలు కుళ్లు కునేలా చేస్తున్నాడు సల్లూ భాయ్.
తాజాగా సల్మాన్ ఖాన్ ఫేస్ మార్ఫింగ్ చేసి ఓ ఫొటో వదిలారు. ఇందులో సల్మాన్ ఖాన్ ముసలివాడిలా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇందులో ఫేస్ అంతా ఉబ్బిపోయి అదో మాదిరిగా కనిపిస్తున్నాడు సల్మాన్ ఖాన్. అతడిని చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఉబ్బిపోయిన ఫేస్‌తో ఉన్న సల్మాన్ ఖాన్ ని చూసి ముసలి తాత సల్మాన్.. సల్మాన్ అంకుల్.. అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, దీనిపై పలు రకాలుగా స్పందిస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3 . మనీశ్ శర్మ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్-కత్రినాకైఫ్, ఇమ్రాన్ హష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది. మరోవైపు ఫర్హద్ సామ్‌జీ డైరెక్షన్‌లో కభీ ఈద్ కభీ దివాళీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన కొత్త అప్ డేట్ బయటకు వచ్చింది. మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టును సల్మాన్ మే 15న మొదలుపెట్టబోతున్నాడని బీటౌన్ సర్కిల్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. తెలుగు హీరో విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడన్న క్రేజీ న్యూస్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది. వెంకీ ఇప్పటికే ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని, దీనిపై అధికారిక ప్రకటన ఒక్కటే పెండింగ్‌లో ఉందని బీటౌన్ సర్కిల్ సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…