Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైనట్టు తెలుస్తోంది. పన్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో శనివారం రాత్రి సల్మాన్‌ఖాన్‌ను పాము కాటేసింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించారు. అయితే సల్మాన్ ఖాన్ విషం లేని పాము కాటుకు గురైనట్లుగా బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఖాన్‌పై పెద్దగా ప్రభావం లేదని చెప్పారు. పాము కాటు తర్వాత సల్మాన్ ఖాన్ నవీ ముంబైలోని కమోతే ప్రాంతంలోని MGM (మహాత్మా గాంధీ మిషన్) ఆసుపత్రిలో చేరాడు.
చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఈరోజు ఉదయం 9 గంటలకు తన పన్వెల్ ఫామ్‌హౌస్‌కి తిరిగి వచ్చారు. సల్మాన్‌ఖాన్ పరిస్థితిని పర్యవేక్షించడానికి రాత్రంతా డాక్టర్లు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తన ఫామ్‌హౌస్‌లో ఉన్నాడు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందనక్కర్లేదని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ ఇటీవల ముంబైలో జరిగిన ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరై ఈవెంట్ ను మరోస్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు సల్మాన్ తో కలిసి మరో వేదికపై కూడా మన హీరోలు హల్చల్ చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి కలసి స్టెప్పులేసి సందడి చేశారు. సల్మాన్ హోస్ట్ చేస్తున్న గ్రాండ్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ కు అలియా, రాజమౌళితో సహా హాజరైన హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మోస్ట్ ఫన్నీ హంగామా సృష్టించారు. ఈ స్టేజ్ పైనే ఎన్టీఆర్, చరణ్ సల్మాన్ తో ఆర్ఆర్ఆర్ సినిమాలో మాస్ సాంగ్ హిందీ వెర్షన్ నాచో నాచోకి కలిపి స్టెప్పేశారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయింది.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…