Sai Pallavi : ఐటమ్‌ సాంగ్స్‌ను అసలు చేసేది లేదంటున్న సాయి పల్లవి.. కారణం కూడా చెప్పేసిందిగా..!

Sai Pallavi : గతంలో అంటే హీరోయిన్లు కేవలం హీరోయిన్ల పాత్రల్లోనే నటించేవారు. ఐటమ్‌ సాంగ్స్‌ చేసే నటీమణులు వేరే ఉండేవారు. ఇలా ఎవరి పని వారు చేసుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. ప్రేక్షకులు కొత్త కొత్త రుచులు కోరుకుంటున్నారు. కనుకనే హీరోయిన్లతోనూ మేకర్స్‌ ఐటమ్‌ సాంగ్స్‌ చేయిస్తున్నారు. ఈ ఫార్ములా కూడా బాగానే క్లిక్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోయిన్లు ఐటమ్‌ సాంగ్స్‌ చేసి మెప్పించారు. పూజా హెగ్డె, కాజల్‌ అగర్వాల్‌, శృతి హాసన్, తమన్నా, సమంతా.. ఇలా చాలా మంది ప్రముఖ హీరోయిన్లు ఐటమ్‌ సాంగ్స్‌లో నటించి అలరించారు. అయితే స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ ఉన్నప్పటికీ సాయి పల్లవి మాత్రం ఐటమ్‌ సాంగ్స్‌లో అసలు నటించబోనని చెబుతోంది. ఆ సాంగ్స్ ను అసలు చేయనని అంటోంది. ఇక దీని వెనుక ఉన్న కారణాలను కూడా ఆమె చెప్పేసింది.

సినీ రంగంలో సాయి పల్లవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆమె నటనలో మంచి మార్కులు కొట్టేసింది. డ్యాన్స్‌ అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె డ్యాన్స్‌కు ఫిదా కాని వారు ఉండరు.. అంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతంగా డ్యాన్స్‌ చేస్తుంది. కనుక ఈమె తలచుకుంటే ఐటమ్‌ సాంగ్స్‌ ఆఫర్లు వెల్లువలా వస్తాయని చెప్పవచ్చు. కానీ సాయి పల్లవి అసలు ఐటమ్‌ సాంగ్స్‌ చేయనని అంటోంది. ఎందుకంటే ఆ సాంగ్స్‌లో వస్త్రధారణ భిన్నంగా ఉంటుంది. అది తనకు నచ్చదని.. అలాంటి దుస్తుల్లో తాను సౌకర్యంగా ఉండలేనని.. అలాంటప్పుడు డ్యాన్స్‌ ఎలా చేస్తానని ప్రశ్నించింది. కనుక ఎట్టి పరిస్థితిలోనూ ఐటమ్‌ సాంగ్స్‌ చేయబోనని తేల్చేసింది.

Sai Pallavi

ఇక సాయిపల్లవి గతంలోనూ ఓ ప్రముఖ కంపెనీకి చెందిన ఫెయిర్‌ నెస్‌ యాడ్‌ను తిరస్కరించింది. తాను సహజసిద్ధంగా కనిపించాలని కోరుకుంటున్నానని.. కృత్రిమ అందం తనకు నచ్చదని చెప్పింది. కొన్ని కోట్లు ఇస్తామన్నా వారి ఆఫర్‌ను ఈమె సున్నితంగా తిరస్కరించింది. దీంతో ఈమె ఎంతో మంది అభిమానులను సైతం సొంతం చేసుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. సాయిపల్లవి చివరిసారిగా శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రంలో నాని పక్కన నటించింది. అలాగే ఈమె నటించిన విరాట పర్వం మూవీ జూలై 1వ తేదీన విడుదల చేస్తామని మేకర్స్‌ ప్రకటించారు. దీంతోపాటు గార్గి అనే మరో మూవీకి సైతం ఆమె సైన్‌ చేసింది. ఇందులో ఈమెదే లీడ్‌ రోల్‌ కాగా.. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రం అని మేకర్స్‌ ప్రకటించారు. ఈ మూవీ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘ధురంధర్ 2’పై రమ్య స్పందన ఫైర్.. థియేటర్లో టైమ్ వేస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు!

నటి రమ్య‌ స్పందన త‌న సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ 2…

Sunday, 22 March 2026, 12:56 PM

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM