RRR : రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా టీమ్ మొత్తం ప్రమోషన్స్ పనులను కూడా నిర్వహిస్తోంది. అలాగే ఈ సినిమా గురించి రిలీజ్ కు ముందు ఎలాంటి సీక్రెట్స్ రిలీజ్ చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యారు డైరెక్టర్ రాజమౌళి. సినిమా గురించి ప్రేక్షకుల అంచనాలకు రీచ్ అయ్యేలా రిలీజ్ కు ముందే ట్రైలర్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ పాటల సందడి ఇప్పటికే మొదలు కాగా, తొలి పాట దోస్తీ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. నవంబర్ 10న ఆర్ఆర్ఆర్ నుండి నాటు నాటు అనే పాట విడుదల కానుందని మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా నాటు నాటు పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో ఇద్దరూ మాస్ స్టెప్స్ వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పాట ప్రేక్షకులకి పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. 10వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఫుల్ సాంగ్ విడుదల కానుంది. స్టైలిష్ లుక్‌లో మాస్ స్టెప్స్‌తో ఈ ఇద్దరు హీరోలు రచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదితా ఉంటే రాజమౌళి రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా డైలాగ్ లీక్ చేసిన విషయం తెలిసిందే. క్రికెటర్ కపిల్ దేవ్ పాల్గొన్న ఓ ప్రోగ్రామ్ లో రాజమౌళి మాట్లాడుతూ తన సినిమాలోని ఓ డైలాగ్ ని చెప్పారు. మనం చేసేది ధర్మ యుద్ధమైతే.. యుద్ధాన్ని వెతుకుతూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. ఈ డైలాగ్ తో ఆర్ఆర్ఆర్ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచేశారు. అయితే ఈ డైలాగ్ సినిమాలో ఎవరు చెబుతారనేది మాత్రం రాజమౌళి రివీల్ చేయలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వస్తున్న ఈ సినిమాని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…
తళపతి విజయ్ నటించిన వీడ్కోలు చిత్రం జన నాయగన్ చుట్టూ నెలకొన్న న్యాయపరమైన వివాదానికి ఎట్టకేలకు ముగింపు పడే సూచనలు…