గురువారం, జూన్ 11, 2026
వార్తలు

RRR : బిగ్ షాక్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ మ‌ళ్లీ వాయిదా..?

RRR : టాలీవుడ్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం 5…

RRR : బిగ్ షాక్.. ఆర్ఆర్ఆర్ రిలీజ్ మ‌ళ్లీ వాయిదా..?

RRR : టాలీవుడ్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. 2022 జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ పాన్ ఇండియా చిత్రం 5 భారతీయ భాషల్లో విడుదల కానుంది. గ‌త కొద్ది రోజులుగా ఈ చిత్రం జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలన జ‌రుపుకుంటోంది. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతరామారాజుగా రామ్‌ చరణ్‌ నటించారు.

RRR movie release may be postponed

ఆర్ఆర్ఆర్ చిత్రంలో తారక్‌ సరసన ఒలివియా మోరీస్‌, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. అయితే ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డ్డ ఈ చిత్రం జ‌న‌వ‌రి 7న వ‌స్తుందని అంద‌రూ ఊహించారు. క‌రోనా వ‌ల్ల ఈ చిత్రం మ‌ళ్లీ వాయిదా ప‌డేలా క‌నిపిస్తోంది. కరోనా మ‌హ‌మ్మారి ఒమిక్రాన్ రూపంలో వణికిస్తుండ‌గా, ఇప్ప‌టికే నైట్ క‌ర్ఫ్యూలు మొద‌లు పెట్టారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా జనవరి 7 న విడుదల కానుంది. ఈ రిలీజ్ తేద నాటికి మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో సినిమా వసూళ్లపై ప్రభావం పడే ఛాన్స్ కూడా ఉండొచ్చు. అందుకే దర్శక నిర్మాతలు సినిమాను వాయిదా వేసే అవకాశాలు లేకపోలేదని చర్చిస్తున్నారు.

మ‌హారాష్ట్ర‌లో 50 శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్స్ న‌డుస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో మూవీ విడుద‌లైతే భారీ న‌ష్టాలు వ‌స్తాయ‌ని, అందుకే ఈ చిత్రాన్ని వాయిదా వేయ‌నున్న‌ట్టు ప్రచారం న‌డుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి