Roja : క‌న్నీటితో జ‌బ‌ర్ద‌స్త్‌కు వీడ్కోలు ప‌లికిన రోజా.. బాధ‌గా ఉంద‌ని కామెంట్స్‌..!

April 15, 2022 8:16 AM

Roja : అందాల రోజా ఒక‌ప్పుడు త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నారు. త‌రువాత రాజీయాల్లో చేరి అందులోనూ రాణించారు. మొద‌ట్లో ఆమె రాజ‌కీయాల్లో అన్నీ ఓట‌ముల‌నే చ‌విచూశారు. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన త‌రువాత ఆమె ల‌క్ మారింది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఓ వైపు సినిమాలు.. టీవీ షోల‌లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ప్ర‌జా సేవ‌లో, రాజ‌కీయాల్లో రోజా యాక్టివ్‌గా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమెకు మంత్రి పద‌వి ల‌భించింది. త‌న ఎన్నో ఏళ్ల క‌ల నెర‌వేరింది. అయితే మంత్రి ప‌ద‌వి వ‌చ్చిన కార‌ణంగా ఆమె ఇక టీవీ షోలు, సినిమాలు చేయ‌న‌ని తేల్చి చెప్పారు.

Roja got emotional farewell to Jabardasth team
Roja

ప్ర‌జా సేవ చేసేందుకే తాను రాజ‌కీయాల్లోకి వెళ్లాన‌ని.. ఇక ఇప్పుడు మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది కాబ‌ట్టి బాధ్య‌త మ‌రింత పెరిగింద‌ని.. క‌నుక టీవీ షోలు, సినిమాల్లో చేయ‌లేన‌ని.. రోజా తెలిపారు. అందువ‌ల్ల ఇకపై ఆమె బుల్లితెర‌.. వెండితెర‌ల‌పై క‌నిపించ‌రు. అయితే ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పారు క‌నుక ఆమెకు నిర్వాహ‌కులు ఓ వీడ్కోలు కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. దానికి రోజా హాజ‌ర‌య్యారు. జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు.. సిబ్బంది అంతా క‌లిసి రోజాకు ఘ‌నంగా వీడ్కోలు ప‌లికారు. ఈ సంద‌ర్భంగా క‌మెడియ‌న్ల‌తోపాటు.. రోజా కూడా ఎమోష‌న‌ల్ అయ్యారు.

జ‌బ‌ర్ద‌స్త్‌ను విడిచిపెడుతుండ‌డం బాధ‌గా ఉంద‌ని.. కానీ న‌ట‌న అనేది సెకండ‌రీ అని.. త‌న‌కు ప్ర‌జా సేవ ముఖ్య‌మ‌ని.. బాధ్య‌తాయుత‌మైన మంత్రి ప‌ద‌విలో ఉంటే ఇక టీవీ షోలు, సినిమాలు చేయ‌లేన‌ని.. చేస్తే ప్ర‌జ‌ల‌కు దూరం అవుతాన‌ని.. క‌నుకనే అన్నింటినీ విడిచిపెట్టాల్సి వ‌స్తుంద‌ని.. రోజా తెలిపారు. ఇక వీడ్కోలు సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్యక్ర‌మం ఎపిసోడ్ త్వ‌ర‌లోనే ప్ర‌సారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను ప్ర‌స్తుతం విడుద‌ల చేయ‌గా.. అది సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment