గురువారం, జూన్ 11, 2026
భార‌త‌దేశం

రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదు.. ఒక్క రోజులోనే 1.45 లక్షల కొత్త కేసులు..

దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శనివారం కొత్తగా 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కోవిడ్‌ కేసుల సంఖ్య కూడా ఇదే కావడం విశేషం. ఇక…

రికార్డు స్థాయిలో కోవిడ్‌ కేసులు నమోదు.. ఒక్క రోజులోనే 1.45 లక్షల కొత్త కేసులు..

దేశవ్యాప్తంగా రోజు రోజుకీ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. శనివారం కొత్తగా 1,45,384 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధికంగా నమోదైన కోవిడ్‌ కేసుల సంఖ్య కూడా ఇదే కావడం విశేషం. ఇక దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్‌ కేసుల సంఖ్య 1,32,05,926 కు చేరుకుంది. కాగా కరోనా ప్రభావం దేశంలో మొదలైనప్పటి నుంచి రోజువారీ కోవిడ్‌ కేసుల సంఖ్య 1 లక్ష మార్కును దాటడం ఇది 5వ సారి. ఏప్రిల్‌ 5వ తేదీన 1,03,558 కోవిడ్‌ కేసులు నమోదు కాగా, 7న 1,15,736 కేసులు నమోదయ్యాయి. అలాగే ఏప్రిల్‌ 8వ తేదీన 1,26,789 కేసులు, 9వ తేదీన 1,31,968 కేసులు నమోదయ్యాయి.

record number of new covid cases registered in a single day

శనివారంతో దేశంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆ సంఖ్య 10,46,631కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 794 మంది చనిపోయారు.

గత సెప్టెంబర్‌ నెల తరువాత దేశంలో యాక్టివ్‌ కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటడం మళ్లీ ఇదే తొలిసారి. సెప్టెంబర్‌ 20, 2020వ తేదీన 10 లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా గడిచిన 24 గంటల్లో 77,567 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి