Rashmi Gautam : బుల్లితెరపై యాంకర్‌గా విజయవంతంగా రాణిస్తున్న రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని సంపాదించుకుంది. ఒకటి రెండు సినిమాల్లో నటించింది. కానీ అనసూయకు వచ్చినంత పేరు ఈమెకు రాలేదు. అనసూయ మాత్రం సినిమాల్లోనూ దూసుకుపోతోంది. అయితే యాంకర్‌గా మాత్రం రష్మి గౌతమ్ ఆకట్టుకుంటోంది.
ఇక రష్మి గౌతమ్ సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన విషయాలను అందులో ఆమె షేర్ చేస్తుంది. గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. రష్మి గౌతమ్ ఎంత గ్లామరస్‌గా ఉంటుందో.. అంతే విధంగా జంతువులను కూడా ఒక రేంజ్‌లో ప్రేమిస్తుంది. ముఖ్యంగా కుక్కలు అంటే ఆమెకు ప్రాణం.
మూగ జీవాలను హింసించారనే వార్తలపై ఆమె ఎల్లప్పుడూ స్పందిస్తుంటుంది. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతుంటుంది. ఇక తాజాగా ఇలాంటిదే ఓ సంఘటనపై ఆమె స్పందించింది.
బెంగళూరులో ఓ యువకుడు తన అపార్ట్‌మెంట్ వద్ద కారు నడుపుతూ అక్కడే పడుకుని ఉన్న ఓ కుక్కను తొక్కించాడు. దీంతో ఆ కుక్క చనిపోయింది. అయితే ఆ యువకుడిది బడా ఫ్యామిలీ అయినప్పటికీ పోలీసులు అవేమీ లెక్క చేయకుండా అతన్ని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే రష్మి స్పందిస్తూ.. ఆ పోలీసులను అభినందించింది. కొందరు డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చని అనుకుంటారని.. కానీ బుద్ధిని కొనలేమని.. ఇలాంటి వాళ్లని కఠినంగా శిక్షించాలని ఆమె కోరింది. అలాగే మూగ జీవాలను అలా హింసించే వాళ్లు వారు కూడా అదే బాధను అనుభవిస్తారని ఆమె పేర్కొంది. కుక్కలను రాళ్లతో కొట్టడం చిన్నతనంలో నేర్పిస్తే వారు పెద్దయ్యాకే ఇలాగే చేస్తారని అభిప్రాయపడింది. కాగా రష్మి వ్యాఖ్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…