Ramya Raghupathi : ప‌విత్ర లోకేష్‌, న‌రేష్‌కు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది.. ర‌మ్య సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

July 4, 2022 12:44 PM

Ramya Raghupathi : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్ కుటుంబ వ్య‌వ‌హారం ప్ర‌స్తుతం రోడ్డుకెక్కింది. ప‌విత్రా లోకేష్‌తో ఆయ‌న మైసూర్ హోట‌ల్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దీంతో ఆయ‌న అభాసు పాల‌వుతున్నారు. ఆయ‌న భార్య ర‌మ్య ర‌ఘుప‌తి వారిని ప‌ట్టుకుంది. అయితే అదే స‌మ‌యంలో ప‌విత్ర‌ను ఆమె చెప్పుతో కొట్టేందుకు య‌త్నించింది. కానీ అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. త‌రువాత వారు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ సంఘ‌ట‌న‌పై స్పందించిన రమ్య మాట్లాడుతూ న‌రేష్‌, ప‌విత్ర లోకేష్‌ల‌పై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది.

తాను న‌రేష్ భార్య‌నే అని.. ఆయ‌న త‌న‌కు ఇంకా విడాకులు ఇవ్వ‌నేలేద‌ని ర‌మ్య స్ప‌ష్టం చేశారు. త‌న‌ను న‌రేష్ మాజీ భార్య అని చెబుతున్నార‌ని.. చ‌ట్ట ప్ర‌కారం ఇది స‌రికాద‌ని అన్నారు. తాము ఇంకా విడాకులు తీసుకోలేదు క‌నుక తాను ఆయ‌న భార్య‌నే అని అన్నారు. అయితే భార్య ఉండ‌గానే ఇంకో మ‌హిళ‌తో సంబంధం పెట్టుకోవ‌డం లేదా ఆమెను పెళ్లి చేసుకోవ‌డం అనేవి చ‌ట్ట ప్ర‌కారం నేరాల‌ని.. క‌నుక న‌రేష్‌కు శిక్ష ప‌డుతుంద‌ని అన్నారు. ఇక ప‌విత్ర లోకేష్ చెబుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాలేనని.. వారు పెళ్లి చేసుకున్నార‌ని.. కానీ అది చ‌ట్ట ప్ర‌కారం చెల్ల‌ద‌ని.. ర‌మ్య అన్నారు.

Ramya Raghupathi says Naresh and Pavitra Lokesh got married already
Ramya Raghupathi

ప‌విత్ర లోకేష్ త‌న‌ను తాను న‌రేష్‌కు మంచి ఫ్రెండ్ అని చెప్పుకుని తిరుగుతోంద‌ని.. కానీ వారి మ‌ధ్య అక్ర‌మ సంబంధం ఉంద‌ని ర‌మ్య అన్నారు. తాను న్యాయ పోరాటం చేస్తాన‌ని.. ఇందులో తాను విజ‌యం సాధిస్తాన‌ని ఆమె చెప్పుకొచ్చింది. అయితే ర‌మ్య ఒక కొత్త పాయింట్‌ను బ‌య‌ట పెట్ట‌డంతో ఈ విష‌యం మ‌రింత వైర‌ల్‌గా మారింది. ప‌విత్ర‌, న‌రేష్ ఇద్ద‌రూ పెళ్లి చేసుకున్నార‌ని ర‌మ్య ఆరోప‌ణ‌లు చేసింది. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అన్న‌ది తెలియాల్సి ఉంది. కానీ న‌రేష్ కుటుంబం మాత్రం అవ‌మానాల పాల‌వుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now