Ram Gopal Varma : సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంటారు. సినిమాలు, రాజకీయాలు, వివిధ అంశాలపై తన అభిప్రాయాలను తెలియజేస్తూ రచ్చ చేస్తుంటారు. రీసెంట్‌గా తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేకతని సాధించిన కొండా దంపతుల నేపథ్యం బేస్ చేసుకుని కొండా సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
గాంధీ లెక్క రెండో చెంప చూపెట్ట నేను.. చంపేస్తా.. అర్ధం కాలే ? అంటూ తీక్షణమైన చూపులతో ఉన్న హీరో కేరక్టరైజన్ పోస్టర్‌లో కనిపిస్తోంది. మరో పోస్టర్‌లో చేతిలో టీ గ్లాస్ పట్టుకుని సీరియస్ లుక్‌తో కొండా మురళి క్యారెక్టర్‌లో కనిపిస్తోంది. ఈ సినిమాతో రాజమౌళి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నాడని వార్తలు వస్తున్న నేపథ్యంలో వర్మ మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
సీఎం కేసీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తెలంగాణ నాయకుడు ఈటల రాజేందర్ జీవితకథతో సినిమా తీస్తున్నారట..! నిజమేనా ? అని ఓ నెటిజన్ వర్మని ప్రశ్నించారు. దీనికి వర్మ.. నాకెందుకో ఈటల రాజేందర్ కేసీఆర్ కు వెన్నుపోటు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు.. సేమ్ అనిపించింది. ఈ ఎపిసోడ్ పై తెలంగాణ నాయకుల్ని కనుక్కుని సినిమా తీస్తా ! అంటూ వర్మ ట్వీట్ చేసిన ఓ ఇమేజ్ ని సదరు అభిమాని షేర్ చేశారు. ఈ సినిమా పేరు `వెన్నుపోటు ఈటల` అంటూ పోస్టర్ ని వేయడం ఆసక్తికరం. ఈ మార్ఫ్ డ్ ఇమేజ్ పోస్టర్ లో కేసీఆర్ బాహుబలి అయితే వెన్నుపోటు పొడిచే కట్టప్పగా ఈటల కనిపించారు. మరి రానున్నరోజుల్లో వర్మ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…