Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత సినిమా రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖుల మధ్య దూరం పెరిగింది. అది పలు సందర్భాలలో స్పష్టంగా కనిపించింది. అయితే పవన్ కళ్యాణ్-మంచు విష్ణుల మధ్య మనస్పర్థలు వచ్చాయని కొద్ది రోజులుగా ప్రచారం నడుస్తోంది. స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ముభావంగా ఉండటం, మంచు విష్ణును అస్సలు పట్టించుకోకుండా ఉండటం నెట్టింట్లో తెగ వైరల్ కావడంతో అభిమానులలో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
తిరుపతిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన మంచు విష్ణు.. అలయ్ బలయ్ కార్యక్రమంలో స్టేజ్ కింద పవన్ కళ్యాణ్ తో మాట్లాడానని చెప్పుకొచ్చారు. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని అన్నారు. అంతే కాకుండా ఆయనేమీ చిన్న స్టార్ కాదు.. చాలా పెద్దస్టార్.. ఆయన సహాయ సహకారాలు కూడా మాకు కావాలని మంచు విష్ణు అన్నారు. ఇక అలయ్ బలయ్ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్.. ఇది మన తల్లి.. జాగ్రత్తగా చూసుకో అని.. అన్నారంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
విష్ణు క్లారిటీ ఇచ్చినా కూడా మంచు, మెగా ఫ్యామిలీల మధ్య వివాదం కొనసాగుతోందని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. ‘అసలు జరిగిన విషయం ఇదే’నంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో.. స్టేజ్ ఎక్కేముందు విష్ణు, పవన్‌లు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటున్న సన్నివేశాలు ఉన్నాయి. ఇద్దరూ హగ్ ఇచ్చుకున్నారు. కొద్ది సేపు సంభాషించుకున్నారు. మరి ఈ వీడియోతో అయినా పుకార్లకు చెక్ పడుతుందా.. లేదా.. అనేది వేచి చూస్తే తెలుస్తుంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…