Ram Charan Tej : రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. దీంతో భారీ మల్టీస్టారర్ లకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోల మల్టీ స్టారర్ మూవీలు ఎక్కువవుతాయని.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఆర్ఆర్ఆర్ సినిమా మరిన్ని మల్టీస్టారర్ ప్రాజెక్ట్స్ కి స్పూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల కాంబోతో మరో సినిమా తెరకెక్కుతందని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్, మహేష్ బాబులతో కలిసి ఓ సినిమా తెరకెక్కుతుందోట.
గతంలో వంశీ పైడిపల్లితో కలిసి రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వంశీ పైడిపల్లి ఈ ఇద్దరు స్టార్స్ తో కలిసి ఓ భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతుందనేది సినీ వర్గాల టాక్. ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం అనేది రూమర్స్ గా ఉన్నప్పటికీ.. మహేష్ బాబుకు మొదట్నుండి మల్టీస్టారర్ లు తెరకెక్కించడం అంటే ఇంట్రెస్ట్ గానే ఉంది.
అలాగే రామ్ చరణ్ కు, మహేష్ బాబుకు మధ్య మంచి బాండింగ్ ఉంది. కనుక వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా వస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో సినిమా వర్కవుట్ అయితే.. బాలీవుడ్ సినిమాల స్థాయిలా.. టాలీవుడ్ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకుంటుంది.
ప్రస్తుతం మహేష్ బాబు ప్రధాన పాత్రలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో కుంభకోణం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…