Ram Asur Movie : అమెజాన్ ప్రైమ్‌లో అత్యంత ఎక్కువ‌గా వీక్షిస్తున్న చిత్రాల్లో ఒక‌టిగా.. రామ్ అసుర్ మూవీ..!

January 29, 2022 2:58 PM

Ram Asur Movie : వెంక‌టేష్ త్రిప‌ర్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సైంటిఫిక్ ఎంట‌ర్‌టైన‌ర్ రామ్ అసుర్‌లో అభిన‌వ్ సర్దార్‌, రామ్ కార్తీక్‌లు న‌టించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్‌ను సాధించింది. ఈ మూవీకి ప్ర‌స్తుతం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. విమ‌ర్శ‌కుల పొగ‌డ్త‌లు సైతం ల‌భిస్తున్నాయి.

Ram Asur Movie is in top trending telugu movies list on amazon prime

అభిన‌వ్ స‌ర్దార్‌కు ఈ మూవీలో న‌ట‌న‌కుగాను ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. ఇందులో యాక్ష‌న్ పాక్డ్ రోల్‌లో అత‌ను న‌టించాడు. ఇత‌న్ని టాలీవుడ్ య‌ష్‌గా తెలుగు ప్రేక్ష‌కులు అభివ‌ర్ణిస్తున్నారు. ఇక రామ్ కార్తీక్ కూడా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు.

రామ్ అసుర్ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో సంక్రాంతి స‌మ‌యంలో విడుద‌లైంది. అయితే ప్ర‌స్తుతం ఈమూవీ అమెజాన్ ప్రైమ్‌లో టాప్ ట్రెండింగ్ తెలుగు మూవీల‌లో రెండో స్థానంలో నిలిచింది. మొద‌టి స్థానంలో పుష్ప ఉండ‌గా.. రామ్ అసుర్ మూవీ రెండో స్థానంలో ఉండ‌డం విశేషం. ఈ మూవీని చాలా మంది వీక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి ఓటీటీలో ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డాన్ని చిత్ర యూనిట్ స్వాగ‌తించింది. వారు ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now