Rakul Preet Singh : రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పెళ్లి చేసుకుంటే.. జైలుకు వెళ్లక తప్పదు..

October 24, 2021 11:21 AM

Rakul Preet Singh : నటిగా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న రకుల్ గత కొద్ది రోజుల క్రితం తాను ప్రేమలో ఉన్నానని.. నిర్మాత, నటుడు జాకీ భగ్నానిని ప్రేమిస్తున్నట్లు అధికారకంగా తెలిపింది. అయితే తాజాగా ఆస్ట్రాలజర్ వేణు స్వామి రకుల్ జాతకం గురించి మాట్లాడుతూ ఆమె పెళ్లి జరగదని తేల్చి చెప్పారు.

Rakul Preet Singh will go to jail if married says astrologer venu swamy

రకుల్ పెళ్లి నిశ్చితార్థంతోనే ఆగిపోతుందని, ఒకవేళ పెళ్లి జరిగినా.. ఆమె విడాకులు తీసుకొని విడిపోతుందని తెలిపారు. అలాగే కొన్ని సమస్యల‌ కారణంగా రకుల్ జైలుకు వెళ్తుందని కూడా తెలిపారు. జాకీది మకర రాశి అని ఆయన జాతకంలో శని దృష్టి చంద్రుడు, శుక్రుడిపై ఉండటంవల్ల వివాహంలో ఎన్నో సమస్యలు వస్తాయని తెలిపారు.

అలాగే రకుల్ ది మిథున రాశి కావడం.. ఆమె జాతకంలో గురువు, కేతువు కలిసి ఉండటం వల్ల కుటుంబం సౌఖ్యం ఉండదని.. వేణు స్వామి తెలిపారు. అందుకే వీరిద్దరి పెళ్లి జరగదని.. నిశ్చితార్థంతోనే వీరి వివాహం ఆగిపోతుందని.. ఒకవేళ పెళ్లి జరిగినా కలసి ఉండరని తెలిపారు. ఇక వేణు స్వామి చెప్పిన జాతకం సమంత విషయంలో నిజమైంది. ఈ క్రమంలోనే రకుల్ విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ ఎంతో షాక్ అవుతున్నారు. మరి రకుల్ జీవితంలో కూడా వేణు స్వామి చెప్పిన విధంగానే జరుగుతుందా.. లేదా.. అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now