Raja Ravindra : తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నటుడిగా ఎంతో మంది హీరో హీరోయిన్లకు మేనేజర్ గా పనిచేసిన నటుడు రాజా రవీంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాజా రవీంద్ర మాట్లాడుతూ.. తన అసలు పేరు రమేష్ దంతులూరు అని తెలిపారు. అయితే ఇండస్ట్రీలో ఆ పేరుతో చాలామంది ఉండటం చేత తన పేరును రాజారవీంద్రగా మార్చుకున్నానని తెలియజేశారు.
తనకు ఇండస్ట్రీ లోకి రాకముందు మార్కెట్ రంగంలో పని చేయాలని ఎంతో కోరికగా ఉండేదని ఈ క్రమంలోనే తన కుటుంబసభ్యుల సహకారంతో ఒక పేపర్ మిల్ స్థాపించినట్లు ఈ సందర్భంగా రవీంద్ర తెలియజేశారు. ఇక పగలంతా పేపర్ మిల్లులో పనిచేస్తూ రాత్రిపూట చదువుకునే వాడినని, ఇలా పేపర్ మిల్లులో పనిచేస్తున్న సమయంలో తను డాన్స్ చేయడం తన పెదనాన్న చూసి తనని చెన్నైలోని ఒక డాన్స్ స్కూల్‌లో చేర్పించి తనకు శిక్షణ ఇప్పించినట్లు ఈ సందర్భంగా తెలిపారు.
అలా శిక్షణ అనంతరం అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఎన్నో ఇబ్బందులు పడ్డాననీ, ఎన్నో కష్టాలను అనుభవించి ఇండస్ట్రీలోకి వచ్చి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నానని ఈ సందర్భంగా రాజా రవీంద్ర తన సినీ కెరీర్ గురించి తెలియజేశారు. ఇక రవితేజ, నవీన్ చంద్ర, జయసుధ వంటి వారికి మేనేజర్ గా పని చేసినట్లు ఆయన తెలిపారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…