Rahul Dravid : భార‌త్‌కు కాకుండా రాహుల్ ద్రావిడ్ ఇంకో దేశానికి కూడా ఆడాడు.. అది ఏ దేశం అంటే..?

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌.. ఈ పేరు తెలియ‌ని క్రికెట్ అభిమాని అంటూ ఎవ‌రూ ఉండ‌రు. రాహుల్ ద్రావిడ్‌, స‌చిన్‌, గంగూలీ.. వీళ్లంద‌రూ స‌మకాలీకులు. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రి గొప్ప‌ద‌నం వారిదే. ఎవ‌రి శైలి వారిదే. అయితే సచిన్‌, గంగూలీ క‌న్నా ద్రావిడ్‌ను అభిమానించే వారే ఎక్కువ‌గా ఉంటారు. అది కూడా ఒక్క విష‌యంలో. ఆయ‌న ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చాడంటే.. ఇక ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చుక్క‌లే. ఎందుకంటే ఒక ప‌ట్టాన ఔట్ కాడు. ఇక టెస్టుల్లో అయితే జ‌ట్టుకు ఒక గోడ‌లా నిలుస్తాడు. జ‌ట్టుకు అడ్డుగోడ‌లా ఉండి ద్రావిడ్ ఎన్నో మ్యాచ్‌లలో భార‌త్‌ను గ‌ట్టెక్కించాడు. అందుక‌నే ఆయ‌న‌ను ది వాల్ అని పిలుస్తారు. అయితే ద్రావిడ్ త‌న కెరీర్‌లో ఒక‌సారి వేరే జ‌ట్టుకు ఆడాడు. అది ఎప్పుడు.. ఆ జ‌ట్టు ఏది ? అంటే..

Rahul Dravid

రాహుల్ ద్రావిడ్ కేవ‌లం భార‌త్‌కే కాక స్కాట్లండ్ జ‌ట్టు త‌ర‌ఫున కూడా ఆడాడు. అది 2003వ సంవ‌త్స‌రంలో అత‌ను ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఆడాడు. మొత్తం 11 మ్యాచ్‌ల‌ను ఆడిన ద్రావిడ్ 600 ప‌రుగులు చేశాడు. అప్ప‌ట్లో భార‌త్‌కు జాన్ రైట్ హెడ్ కోచ్‌గా ఉండేవారు. ఆ స‌మ‌యంలోనే ద్రావిడ్ స్కాట్లండ్ జ‌ట్టుకు ఓవ‌ర్సీస్ ప్రొఫెష‌న‌ల్ ప్లేయ‌ర్‌గా ఆడాడు. ఇందుకు గాను 3 నెల‌లు స‌మ‌యం కేటాయించాడు. దీంతో ద్రావిడ్‌కు 45వేల పౌండ్ల వేత‌నాన్ని కూడా ఇచ్చారు. ఇక ఆ స‌మ‌యంలో మొత్తం ఆడిన మ్యాచ్‌లు అన్నీ వ‌న్డేలే కావ‌డం విశేషం.

ఆ మ్యాచ్‌ల‌లో ఒక టూర్ గేమ్ పాకిస్థాన్‌తో ఆడాడు. 11 మ్యాచ్‌ల‌లో ద్రావిడ్ 66.66 స‌గ‌టుతో ఏకంగా 600కు పైగా ప‌రుగులు చేశాడు. అందులో 3 సెంచ‌రీలు, 2 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. 92.73 స్ట్రైక్ రేట్‌తో ద్రావిడ్ ఆ ప‌రుగులను సాధించాడు. ఇక అదే సీజ‌న్‌లో ద్రావిడ్ టెస్టుల్లో 95.46 స‌గ‌టును సాధించ‌గా.. పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్లో 270 ప‌రుగులు చేశాడు. ఆ సీజ‌న్ లో ద్రావిడ్ మొత్తం 22 సెంచ‌రీలను 41.77 స‌గ‌టుతో సాధించ‌డం విశేషం. అందుక‌నే ద్రావిడ్‌ను ది వాల్‌గా అభివ‌ర్ణించారు. ఇక ద్రావిడ్ ప్ర‌స్తుతం భార‌త జ‌ట్టు హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నాడు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM