F3 Trailer : మాది మెగా ఫ్యామిలీ.. మాది ద‌గ్గుబాటి ఫ్యామిలీ.. వెంకీ, వ‌రుణ్ లు చించేశారుగా..!

F3 Trailer : వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్ లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో.. ఎఫ్2కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన చిత్రం.. ఎఫ్3. ఈ చిత్ర ట్రైల‌ర్‌ను కాసేప‌టి క్రిత‌మే లాంచ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఎఫ్2 ద్వారా ఎంట‌ర్‌టైన్ చేసిన చిత్ర బృందం ఎఫ్3 ద్వారా డ‌బుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందించేందుకు సిద్ధ‌మవుతోంది. కాగా ఎఫ్2తో పోలిస్తే ఎఫ్3లో కామెడీ ఒక రేంజ్‌లో ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ట్రైల‌ర్‌ను చూస్తేనే క‌డుపుబ్బా న‌వ్వు వ‌స్తుంద‌ని.. ఇంకా సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అని అంద‌రూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మూవీని దిల్ రాజు నిర్మించ‌గా.. అనిల్ రావిపూడి ద‌ర్శ‌కత్వం వ‌హించారు.

F3 Trailer

త‌న‌దైన శైలిలో కామెడీ సీన్ల‌ను తీయ‌డంలో అనిల్ రావిపూడి పెట్టింది పేరు. అందులో భాగంగానే ఎఫ్2 బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు ఎఫ్3 ట్రైల‌ర్‌ను చూస్తుంటే దాని క‌న్నా రెట్టింపు వినోదం ప్రేక్ష‌కుల‌కు ల‌భించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా కొన్ని సీన్ల‌లో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ లు అద్భుతంగా కామెడీని పండించారు. ఒక సీన్‌లో వెంకీ త‌మ‌ది ద‌గ్గుబాటి ఫ్యామిలీ అని అంటే.. ఇంకో సీన్‌లో వ‌రుణ్ తేజ్ త‌మ‌ది మెగా ఫ్యామిలీ అని అంటాడు. ఈ సీన్లు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌చే విజిల్స్ కొట్టిస్తాయ‌ని చెప్ప‌డంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

ఇక ఈ మూవీని ఔట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే తెలుస్తోంది. ఈ మూవీ మే 27వ తేదీన విడుద‌ల కానుండ‌గా.. ఇందులో బుట్ట‌బొమ్మ పూజా హెగ్డె ఓ ఐట‌మ్ సాంగ్ చేసింది. ఇది సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక సినిమా క‌థ విష‌యానికి వ‌స్తే.. ఎఫ్2లో ఎలాగైతే భార్య‌ల ద్వారా భ‌ర్త‌లు ఇబ్బందులు ప‌డ్డారో.. ఇందులోనూ అలాగే చూపించ‌నున్న‌ట్లు ట్రైల‌ర్‌ను చూస్తే స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఈ సినిమాలో హోట‌ల్ బిజినెస్ పెట్టి భారీగా న‌ష్ట‌పోయిన భ‌ర్త‌లుగా వెంకీ, వ‌రుణ్ తేజ్ లు న‌టించార‌ని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM