Pushpa Movie : అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటిస్తోంది. ఇటీవల ఈ సినిమా నుంచి శ్రీవల్లి సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది. రెండు భాగాలుగా చిత్రం తెరకెక్కుతుండగా, ఫస్ట్ పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
పుష్ప మొదటి భాగం పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఒక్క ఇండియాలోనే ఈ సినిమాని గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండటమే కాకుండా ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ లో కూడా భారీ లెవల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూఎస్ మార్కెట్ లో ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో కూడా హంసిని ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే క్లాసిక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.
పుష్ప రిలీజ్ అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా ఉంటుంది అని తెలుస్తోంది. అలాగే డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ తో ఈ చిత్రం అక్కడ రచ్చ స్టార్ట్ చేయనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మలయాళీ నటుడు ఫహద్ ఫాసిల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఫహద్ పాసిల్ ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ చిత్రంలో శాండల్‌వుడ్ యువ నటుడు ధనంజయ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…