Puri Jagannadh : విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ పోషించిన పాన్ ఇండియా మూవీ లైగర్. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఊహించని ఫెయిల్యూర్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు కోలుకోలేనంత నష్టం తెచ్చిపెట్టినట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో నిర్మాతలైన ఛార్మీ, పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లకు నష్టపరిహారం పంపిణీ మొదలుపెట్టినట్టు కొన్ని కథనాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఆడియో ప్రకారం పూరీ, ఛార్మీ ఇంకా వారికి నష్టపరిహారం చెల్లించలేదట. బయ్యర్లు చాలా కోపంగా ఉన్నారని, 2 నెలలు దాటినా తమకు క్లియరెన్స్ చేయలేదని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వారు ధర్నాకు దిగుతున్నారని, మీటింగ్ లు పెట్టుకుంటున్నారని సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఈ క్రమంలో దీపావళి రోజు పూరీ వాళ్లకి వార్నింగ్ ఇచ్చిన ఆడియో ఒకటి వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ ఆడియోలో ఏముందంటే.. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నారా..? నేను ఎవరికీ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్ళు కూడా నష్టపోయారులే అని. ఆల్రెడీ బయ్యర్స్ తో మాట్లాడ్డం జరిగింది. మన ఒప్పందం ప్రకారం చెప్పిన మొత్తాన్ని ఒక నెలలో ఇస్తాను. అలా చెప్పాక కూడా మళ్లీ ఇలా చేస్తుంటే ఇవ్వాలని అనిపించదు.
అయినా మేం ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తియ్యాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందరం గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని సినిమాలు ఆడతాయి కొన్ని సినిమాలు పోతాయి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బులు ఎంతో వుంది. బయ్యర్స్ అసోసియేషన్ నాకు ఆ అమౌంట్ వసూల్ చేసి పెడుతుందా? ధర్నా చేస్తాం అంటున్నారు చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ళ లిస్ట్ తీసుకొని, వాళ్ళకి తప్పా మిగతా వాళ్ళకి ఇస్తా అంటూ వార్నింగ్ ఇచ్చినట్టుగా ఓ ఆడియో కాల్, మెసెజ్ వైరల్ అవుతోంది. మరి ఇందులో నిజమెంతుందో పూరీకే తెలియాలి.
తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంటర్నెట్‌లో…
తమిళ స్టార్ నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన జన నాయకన్ చిత్రం మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఆలస్యాలకు…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తాజా వ్యాఖ్యలతో మరోసారి సోషల్ మీడియాలో చర్చకు తెర తీశారు. ధురంధర్ 2 ది…
ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో డిల్లీ క్యాపిటల్స్‌కు హీరోగా…
ప్రస్తుత తరుణంలో యువత హీరోలు, హీరోయిన్ల పట్ల ఎక్కువగా ఆకర్షితమై చదువులపై శ్రద్ధ పెట్టడం లేదని, సామాజిక మాధ్యమాల వల్ల…
నటీనటులు మాతృభాషలో కాకుండా ఇతర భాషల్లో సినిమాలు చేస్తే ఆయా భాషలను నేర్చుకుంటేనే సౌకర్యవంతంగా ఉంటుందని నటి కయాదు లోహర్…
పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కాంబినేషన్‌లో వస్తున్న మొదటి చిత్రంగా ఇప్పటి వరకు…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు…