Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ మరణం కన్నడ సినీ పరిశ్రమకు తీరని విషాదాన్ని మిగిల్చింది. అభిమానులు కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీ ప్రముఖులు కూడా పునీత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ బాధను వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, ఎన్టీఆర్‌తోపాటు పలువురు తెలుగు సినీ ప్రముఖులు బెంగళూరు వెళ్లి పునీత్ పార్ధీవ దేహానికి నివాళులు అర్పించారు.
పునీత్ మరణంపై స్పందించిన భోళా శంకర్ దర్శకుడు మెహర్ రమేష్.. చాలా ఆవేధన వ్యక్తం చేశారు. ‘పునీత్ నాకు లైఫ్ ఇచ్చిన హీరో. ఆయన హీరోగా నటించిన ‘వీర కన్నడిగ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాను. ఈ సినిమా తర్వాత ఆయనతో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. నన్ను ఇంటి సభ్యుడిలా చూసుకునేవారు.
చిరంజీవితో భోళా శంకర్ సినిమా ప్రకటించినప్పడు ఆయన నాకు ఫోన్ చేసిశుభాకాంక్షలు తెలియజేసి సినిమాలో చిరంజీవి పక్కన నటించే ఛాన్స్ ఇవ్వమని కోరారు. అది కుదరకపోతే కనీసం ఏదైనా ఒక పాటలో మెగాస్టార్‌తో కలిసి చిన్న స్టెప్పు వేస్తానని అడిగారు. చిరంజీవితో నటించాలన్నది తన కోరిక అని కూడా చెప్పారు. ఆయన ఇలా హఠాన్మరణం చెందడం చాలా బాధను కలిగిస్తుందని ఎమోషనల్ అయ్యారు మెహర్ రమేష్. కాగా, గుండె పోటుతో మరణించిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలను ఆదివారం నిర్వహించారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…