గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Prakash Raj : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌కాశ్ రాజ్‌.. అన్నీ ఆలోచించే ఇలా చేశానని వ్యాఖ్యలు..

Prakash Raj : తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడి ఎట్ట‌కేల‌కు ముగిసింది. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై…

Prakash Raj : సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌కాశ్ రాజ్‌.. అన్నీ ఆలోచించే ఇలా చేశానని వ్యాఖ్యలు..

Prakash Raj : తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో వాగ్వాదాలు, మరెన్నో పరస్పర ఆరోపణలు, దూషణల నడుమ జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ ఎన్నికల హడావిడి ఎట్ట‌కేల‌కు ముగిసింది. మంచు విష్ణు 107 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి ప్రకాశ్‌రాజ్‌పై ఘనవిజయం సాధించారు. మంచు విష్ణుకు 381 ఓట్లు పోలవ్వగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పడ్డాయి. అయితే మా ఎన్నిక‌ల‌లో తాను ఓడిపోవ‌డంపై ఆవేద‌న చెందిన ప్ర‌కాశ్ రాజ్ మా స‌భ్య‌త్వానికి రాజీనామా చేశారు.

Prakash Raj resigned to maa membership

నేను తెలుగువాడిని కాదు.. అతిథిగా వచ్చాను.. అతిధిగానే ఉంటానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. తాను అసోసియేషన్ నుంచి బయటికి వచ్చానని. నటించవద్దని ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి.. యథావిధిగా తెలుగు సినిమాల్లో నటిస్తానని వివరించారు. తనను నాన్ లోకల్ అన్నారని.. అతిథిగా ఉంటేనే గౌరవిస్తామన్నారు.. తనకు ఆత్మాభిమానం ఉందని. అందుకే బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్టు తెలియ‌జేశారు.

అసోసియేష‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చినా సినిమాలు చేస్తాను. ‘మా’తో 21 ఏళ్ల అనుబంధం ఉందన్న ప్రకాష్ రాజ్.. ఈరోజుతో ఆ బంధానికి తెరదించుతున్నట్లు ప్రకటించారు. ఓట‌మిని జీర్ణించుకున్నాక అంతా ఆలోచించే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపును స్వాగాతిస్తున్నానని ప్రకాష్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు.

కాగా ప్ర‌కాశ్ రాజ్‌కి స‌పోర్ట్ చేసిన నాగ‌బాబు మా నుండి త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టు మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ లో కొనసాగడం ఇష్టం లేక మా అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను సెలవు అంటూ నాగబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి