Prakash Raj : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో భాగంగా అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు ప్యానెల్ సభ్యులు పరస్పరం మాటల యుద్ధం చేసుకుంటూ.. సాధారణ ఎన్నికలను తలపించాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా అక్టోబర్ 10వ తేదీన జరిగిన ఎన్నికలలో మంచు విష్ణు అధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు.
ఈ క్రమంలోనే మా ఎన్నికలలో భాగంగా ఓడిపోయిన ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ప్రెస్ మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికలు కేవలం ప్రాంతీయత ఆధారంగా జరిగాయని. తెలుగువాళ్లు అధ్యక్ష పీఠాన్ని తెలుగు బిడ్డ అధిరోహించాలని కోరుకున్నారని.. అదే విధంగా మంచు విష్ణును గెలిపించారని తెలియజేశారు.
ఇక తాజాగా ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. తాను మా సభ్యత్వానికి రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అనే విషయాన్ని తొందరలోనే తెలియజేస్తానని.. తన రాజీనామా వెనుక ఒక లోతైన కారణం ఉందంటూ.. త్వరలోనే వాటన్నింటినీ క్లుప్తంగా వివరిస్తానని పేర్కొంటూ పలు షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…