Prabhas : యంగ్ రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకుని తరువాత పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన బాహుబలి సినిమాల ద్వారా పాన్ ఇండియా స్టార్ హోదాను పొందారు. అయితే బాహుబలి తరువాత ప్రభాస్‌కు హిట్స్ పడలేదు. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు నిరాశ పరిచాయి. దీంతో బాహుబలి ముద్ర నుంచి బయటకు వచ్చేందుకు ప్రభాస్ ఎంతో శ్రమిస్తున్నారు. ఇక ప్రభాస్‌కు ప్రస్తుతం 40 ఏళ్లకు పైగానే వయస్సు ఉంది. దీంతో ఆయన పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని.. ఆయన ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ మధ్య కాలంలో ప్రభాస్ తన రాధేశ్యామ్ మూవీ ప్రమోషన్స్ సమయంలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు పెళ్లిపై అడిగిన ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు దాటవేశారు. ఈ క్రమంలోనే అసలు ప్రభాస్ పెళ్లి జరుగుతుందా.. లేక ఆయన కూడా సల్మాన్ ఖాన్‌లా వృద్ధ బ్యాచిలర్‌గా మిగిలిపోతారా.. అని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మాత్రం ఇటీవలే ఓ మీడియా సంస్థకు ప్రభాస్ పెళ్లి గురించి చెప్పారు. ఈ ఏడాదే ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడని అన్నారు.
ఇక ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామం కృష్ణం రాజు, ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషణ్ అధ్యక్షుడు కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకుంటాడని చెప్పారు. దీంతో ఫ్యాన్స్‌కు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఈ సారి వచ్చే శ్రావణ మాసంలో ప్రభాస్ పెళ్లి ఉంటుందని భావించవచ్చు. అయితే వధువు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే కృష్ణం రాజు దంపతులు మీడియాకు వెల్లడించనున్నారట. ఈ విషయాన్ని చెప్పేందుకు తగిన సమయం తీసుకోనున్నారట. అందువల్లే ఈ విషయమై ఆలస్యం జరుగుతుందని తెలుస్తోంది. ఇక ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…