Allu Arjun : అల్లు అర్జున్ లేటెస్ట్ చిత్రం పుష్ప ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ మార్కెట్‌లోనూ ఈ మూవీ భారీగానే వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలోనే త్వరలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభం కానుంది. దీనికి గాను ప్రస్తుతం దర్శకుడు సుకుమార్ కథను తీర్చిదిద్దేపనిలో పడ్డారు. ఇక పుష్ప ద్వారా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌తో యాడ్స్ చేసేందుకు అనేక సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పలు యాడ్స్ లో నటిస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న యాడ్స్ వివాదాల్లో చిక్కుకుంటున్నాయి.
గతంలో అల్లు అర్జున్ ర్యాపిడో అనే బైక్ ట్యాక్సీ సంస్థకు యాడ్ చేసిన విషయం విదితమే. ఆర్‌టీసీ బస్సుల కన్నా ర్యాపిడో బాగా వేగంగా వస్తుందని ఆ యాడ్‌లో చూపించారు. దీంతో తెలంగాణ ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్ ఈ విషయంపై సీరియస్ అయ్యారు. అల్లు అర్జున్‌తోపాటు సదరు యాడ్‌ను తీసిన సంస్థకు నోటీసులు పంపించారు. దీంతో వారు కాస్త వెనక్కి తగ్గి యాడ్‌కు మార్పులు చేశారు. ఆర్టీసీకి సారీ చెప్పారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ మళ్లీ ఇంకో యాడ్ వల్ల వివాదంలో ఇరుక్కున్నారు.
అల్లు అర్జున్ ఈ మధ్య శ్రీ చైతన్య విద్యాసంస్థలకు చెందిన యాడ్స్‌లో నటిస్తున్నాడు. విద్యార్థులను అందులో చేర్పించాలని యాడ్స్ లో చూపిస్తున్నారు. అయితే జూన్ 6వ తేదీన శ్రీచైతన్య సంస్థకు చెందిన ఐఐటీ, ఎన్ఐటీ ర్యాంకుల యాడ్ వచ్చింది. అయితే అందులో వివరాలను తప్పుగా ఇచ్చారని, సమాచారం మొత్తం తప్పుదోవ పట్టించేదిలా ఉందని.. సామాజిక కార్యకర్త ఉపేందర్ రెడ్డి మండిపడ్డారు. దీంతో ఆయన ఆ సంస్థతోపాటు ఆ యాడ్‌లో నటించిన అల్లు అర్జున్‌పై ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ మళ్లీ వివాదంలో చిక్కుకుపోయారని చెప్పవచ్చు. అయితే దీనిపై సదరు సంస్థ లేదా అల్లు అర్జున్ టీమ్ ఎలా స్పందిస్తారో.. చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…