Brahmanandam : లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్‌ల వివాహం ఘనంగా జరిగిన విషయం విదితమే. గురువారం మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బంధువులు, కుటుంబ సభ్యులు, సెలబ్రిటీల నడుమ వీరు పెళ్లి చేసుకున్నారు. గత 7 సంవత్సరాల నుంచి ప్రేమలో పీకల్లోతు మునిగిపోయి ఉన్న ఈ జంట ఎట్టకేలకు వివాహ బంధం ద్వారా ఒక్కటైంది. ఈ క్రమంలోనే వారు తమ వివాహం సందర్భంగా తమిళనాడు రాష్ట్రమంతటా ఒకేసారి 1 లక్ష మంది పేదలకు అన్నదానం చేసి గొప్పమనసు చాటుకున్నారు. ఇక వీరికి సెలబ్రిటీలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే నయనతార పెళ్లి ఏమోగానీ.. సోషల్ మీడియాలో మాత్రం జోకులు పేలుతున్నాయి. గతంలో ఈమె నటించిన అదుర్స్ సినిమాలోని పలు కామెడీ సీన్లను ఇప్పటి ఆమె పెళ్లికి జత చేస్తూ కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి. అదుర్స్ సినిమాలో బ్రహ్మానందం భట్టు అనే పాత్రలో నటించిన విషయం విదితమే. అయితే రమాప్రభ, నయనతారకు ఆయన సహాయం చేస్తారు. ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కానీ కథ అడ్డం తిరుగుతుంది. పెళ్లి చూపులకని తోడు వచ్చిన ఎన్‌టీఆర్‌ను చూసి నయనతార మనస్సు పడుతుంది. దీంతో భట్టు పడే ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే అవే సీన్లను ఇప్పుడు మళ్లీ గుర్తు చేస్తున్నారు.
నయనతారకు వేరే వ్యక్తితో పెళ్లి అయిందని.. భట్టు ఇప్పుడు ఏం చేస్తాడని.. కొందరు మీమ్స్ సృష్టిస్తున్నారు. ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి మళ్లీ పుడతావురా భట్టూ.. అని మగధీర డైలాగ్‌ను మిక్స్ చేసి మరీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో ఆ మీమ్స్‌ను చూసి నెటిజన్లు పెద్ద ఎత్తున నవ్వుతున్నారు. వారు ఈ మీమ్స్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. సహజంగానే బ్రహ్మానందం ఫొటోలు మీమ్స్‌కు అనువుగా ఉంటాయి. అందరిపై ఆయన సెటైర్లు వేస్తున్నట్లు మీమ్స్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆయనపైనే సెటైర్లు పేలుతున్నాయి. అయితే ఇవన్నీ సరదాకి మాత్రమే. వీటిని ఎవరూ అపార్థం చేసుకోవద్దని.. మీమ్స్ సృష్టించిన వారు కోరుతున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…