Hyper Aadi : వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా.. ఇప్పటికే చాలా మంది నటీనటులు ప్రేమించి పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇది సహజమే. అయితే కొందరు ఉన్నట్లుండి తమ ప్రేమకు సంబంధించిన విషయాలను తెలియజేయడం సంచలనంగా మారుతోంది. తాజాగా హైపర్ ఆది, యాంకర్ వర్షిణి ఇలా చేశారు. యాంకర్ వర్షిణి అయితే హైపర్ ఆదిని ప్రేమిస్తున్నట్లు చెప్పకనే చెప్పింది. దీంతో అసలు ఆమె ఆ పోస్ట్ ఎందుకు పెట్టిందా.. అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..
జబర్దస్త్ వేదికపై హైపర్ ఆదికి ఉన్న పేరు అంతా ఇంతా కాదు. అయితే కొన్నాళ్లుగా ఆది ఆ షోలో కనిపించడం లేదు. శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో మాత్రమే వస్తున్నాడు. ఇక యాంకర్ వర్షిణితో కలసి గతంలో ఆది ఢీ స్టేజిపై సందడి చేశాడు. అయితే ఆది బర్త్ డే సందర్భంగా యాంకర్ వర్షిణి అతనికి శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదు. కానీ ఆ బర్త్ డేను వీరిద్దరూ ప్రయివేట్‌గా జరుపుకున్నారు. ఇదే పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇక ఆది బర్త్ డే సందర్భంగా వర్షిణి ఒక పోస్ట్ పెట్టింది. అందులో వారిద్దరే ఉన్నారు. బర్త్ డేను సెలబ్రేట్ చేసిన వీడియోతో ఆమె ఒక కామెంట్ కూడా పెట్టింది. అందులో వర్షిణి ఏం చెప్పిందంటే.. డియర్ ఆది.. నీకు బర్త్ డే శుభాకాంక్షలు.. నా జీవితంలో చివరి వరకు నువ్వు నాతోనే ఉండాలని కోరుకుంటున్నా.. నువ్వు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తివి.. తెల్లవారు జామున 3 గంటలకు అందుబాటులో ఉండే స్నేహితుడివి.. నన్ను నువ్వు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నావు.. రైటర్ ఆది.. నువ్వు నాకు రైట్ రా ఆది.. అంటూ పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
హైపర్ ఆది, యాంకర్ వర్షిణిలు ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకు కారణం ఆమె ఆ పోస్టును పెట్టడమే అని చెప్పవచ్చు. అయితే ఇది తెరపై కాదు.. రియల్ లైఫ్‌లోనే జరిగింది. పైగా వర్షిణి పోస్ట్ కూడా పెట్టింది. కనుక వీరి లవ్ కన్‌ఫామ్ అనే తెలుస్తోంది. మరి దీనిపై వారు ఏమైనా స్పందిస్తారో.. లేదో.. చూడాలి.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…