Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న విషయం విదితమే. ప్రస్తుతం ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో సలార్ అనే మూవీ చేస్తున్నారు. అలాగే ఆది పురుష్ సినిమా ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నారు. దీంతోపాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె అనే మూవీ చేస్తున్నాడు. అయితే బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు రెండూ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దీంతో ఈసారి రిలీజ్ అయ్యే మూవీతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే తపనతో ప్రభాస్ సినిమాలు చేస్తున్నాడు.
ఇక ఈ మధ్య కాలంలో ప్రభాస్ చాలా వర్కవుట్లు చేసినట్లు సమాచారం. అందులో భాగంగానే ఆయన తాజాగా స్లిమ్‌గా.. వెనుకటి బాహుబలి లుక్‌లో కనిపించాడు. నిజానికి బాహుబలి మూవీ తరువాత ప్రభాస్ బాగా బరువు పెరుగుతూ వచ్చాడు. రాధేశ్యామ్ అనంతరం ఇంకా ఎక్కువ లావుగా కనిపించాడు. దీంతో ఆయనను ట్రోల్ చేశారు. అయితే తనపై వస్తున్న విమర్శలో.. మరో కారణమో తెలియదు కానీ.. ప్రభాస్ తాజాగా మళ్లీ ఫిట్ అయిన లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఈ క్రమంలోనే ఆయన లేటెస్ట్ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ కోసమే ప్రభాస్ ఇలా మళ్లీ ఫిట్ బాడీలోకి మారాడని అంటున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్‌ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ మూవీ రిలీజ్ కానుందని సమాచారం. అయితే మరో ఏడాదిలో ప్రభాస్ పెళ్లి కూడా అవుతుందని వార్తలు వచ్చాయి. కృష్ణం రాజు ఇప్పటికే ప్రభాస్‌కు మంచి సంబంధం చూశారని అంటున్నారు. మరి ప్రభాస్ ఇంత బిజీ షెడ్యూల్‌లో పెళ్లి చేసుకుంటారా.. లేదా.. అన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు…
Xiaomi ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త REDMI Note 15 Pro Seriesను అధికారికంగా విడుదల చేసింది. ఈ…
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…