Pooja Hegde : పూజా హెగ్డె ఒకప్పుడు టాలీవుడ్‌లో కుర్రహీరోలతో కలిసి సినిమాలు చేసేది. అరవింద సమేత తర్వాత ఈ అమ్మడి ఫేట్ మారింది. బడా హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే పూజా హెగ్డె మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో సత్తా చాటుతోన్నప్పుడే మూగమూడి అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుణ్ తేజ్ నటించిన ముకుందతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత నాగ చైతన్యతో ఒక లైలా కోసం చేసింది. ఇవన్నీ ఆమెకు నిరాశనే మిగిల్చాయి.
అరవింద సమేత.. వీరరాఘవతో హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా మహర్షి, గద్దలకొండ గణేష్, అల.. వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్.. వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస హిట్లతో హవాను చూపిస్తూ ముందుకు సాగింది. ఇటీవలే ఆమె రాధే శ్యామ్ అనే పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇది డిజాస్టర్‌గా మిగలడంతో పూజాకు భారీ షాక్ తగిలింది. అలాగే విజయ్‌తో కలిసి చేసిన బీస్ట్ మూవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి.
రెండు ఫ్లాపులు వచ్చినా పూజా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ అమ్మడు ఒక సినిమా కోసం దాదాపు రూ.2.75 కోట్ల నుండి రూ.3 కోట్ల వరకు అందుకుంటోంది. ఇక రంగస్థలంలో స్పెషల్ సాంగ్ చేసిన పూజా హెగ్డె ఇప్పుడు ఎఫ్ 3 సినిమాలోనూ చేస్తోంది. ఈ పాట చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ పాట కోసం పూజ ఏకంగా రూ.1.75 కోట్లు వసూలు చేసింది. ఒక్క పాట కోసమే ఇంత పెద్ద మొత్తంలో ఏ నటి అందుకోలేదు. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలో ఊ అంటావా.. పాటకు సమంత రూ.1.50 కోట్ల పారితోషికం తీసుకున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డె ఆ రికార్డ్‌ని బద్దలు కొట్టింది. దీంతో పూజా హెగ్డె కొత్త రికార్డును సృష్టించినట్లు అయింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…