Pooja Hegde : రాధే శ్యామ్ చిత్రం రిలీజ్ ముందుకు వరకు పూజా హెగ్డె క్రేజ్ మాములుగా ఉండేది కాదు. చిన్నహీరోతో నటించినా, పెద్ద హీరోతో అయినా.. ఆ సినిమా హిట్టవ్వాల్సిందే. ఈ క్రమంలో దిల్ రాజు బీస్ట్ ప్రమోషన్స్ లో పూజా మన కాజా అంటూ ప్రశంసలు కురిపించారు. పూజా మన కాజా.. ఆమె లెగ్గు పెడితే సూపర్ హిట్టే. డీజే, మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురములో సూపర్ హిట్ మూవీస్ అయ్యాయి. బీస్ట్ మూవీ ఆల్ రెడీ సూపర్ హిట్. నాకు కూడా సూపర్ హిట్ కావాలి. కాబట్టి నాకు పూజా డేట్స్ ఇస్తే బాగుంటుంది. ఆమె తెలుగు, తమిళం, హిందీ.. ఇలా ప్రతి భాషలోనూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఆల్ ఇండియా హీరోయిన్‌గా మారింది. డ్యాన్సులతోపాటు పర్‌ఫార్మెన్స్ పరంగా ప్రతి సినిమాకు ఎదుగుతూ వస్తోంది.. అని తెగ ప్రశంసలు కురిపించారు.
అయితే రాధే శ్యామ్ ఫ్లాప్ పూజాని కాస్త కుంగదీయగా, బీస్ట్ పరాజయంతో పూజాపై కాస్త నెగెటివిటీ ఏర్పడింది. ఇక ఆచార్య ఫ్లాప్ తర్వాత పూజాని ఐరెన్ లెగ్ అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఏమయ్యా.. దిల్ రాజు పూజా మన కాజానా అంటూ ఆయనను కూడా ఇందులోకి లాగుతున్నారు. ఆచార్య చిత్రంలో పూజాది చిన్న రోల్ మాత్రమే. అయినప్పటికీ ఆ అమ్మడి వల్లనే సినిమా ఫ్లాప్ అయిందని కొందరు వితండవాదం చేస్తున్నారు. పూజా తిరిగి సేఫ్ జోన్‌లోకి రావాలంటే మహేష్, పవన్ కళ్యాణ్ లు ఈ అమ్మడిని ఆదుకోవాలి.
పూజా హెగ్డె త్వరలో మహేష్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న సినిమాలో నటించనుంది. అలాగే పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ సినిమాలోనూ ఈ అమ్మడినే కథానాయికగా ఎంపిక చేశారు. ఈ పరిస్థితులలో పూజా రెండు సినిమాలపై భారీ అంచనాలే పెట్టుకుంది. ప్రస్తుతం ఈమె ఒక సినిమాకి రూ.3.50 కోట్లు తీసుకుంటుందని టాక్. రీసెంట్‌గా ఎఫ్3 సినిమాలో స్పెషల్ డ్యాన్స్‌తోనూ ఈ అమ్మడు అదరగొట్టిందనే టాక్ నడుస్తోంది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…