Pawan Kalyan : నిన్న ప‌వ‌న్‌, నేడు అజిత్‌.. బిరుదుల‌తో పిల‌వొద్దంటూ విజ్ఞ‌ప్తి..!

Pawan Kalyan : హీరోల‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా అభిమానులు త‌మ అభిమాన స్టార్స్‌ని ముద్దుగా ప‌లు పేర్ల‌తో పిలుచుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పేర్ల‌తో పిలిపించుకునేందుకు వారు ఆసక్తి చూప‌డం లేదు. గోకులంలో సీత సినిమాకు పోసాని కృష్ణ‌ముర‌ళి మాట‌లు రాశాడు. ఈ సినిమాకు ప‌నిచేసిన స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూసిన‌ పోసాని.. ప‌వ‌ర్ స్టార్ పేరు ఆయ‌న‌కు స‌రిగ్గా స‌రిపోతుంద‌ని అనుకున్నాడు. అప్ప‌టి నుండి ప‌వ‌ర్ స్టార్ పేరు ప‌వ‌న్ ముందు యాడ్ అయింది.

అయితే గత కొద్ది కాలంగా పవన్ కళ్యాణ్ అభిమానులకి ఒక విషయం పదే పదే చెబుతూ వస్తున్నారు. తనను పవర్ స్టార్ అని పిలవద్దు అంటూ చెప్పుకొచ్చారు. పవర్ లేనివాడు పవర్ స్టార్ కాదని.. తనను జనసేనాని అని పిలవండి చాలు అన్నారు. తాను సరదాగా రాజకీయాలు చేయడం లేదు.. బాధ్యతతో రాజకీయాలు చేస్తున్నాని పవన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా త‌మిళ స్టార్ హీరో అజిత్ త‌న‌ను త‌ల అజిత్ అని పిల‌వొద్దంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

Pawan Kalyan ajith asked their fans not to call them with those names

‘ఇకపై ఎవరూ కూడా నన్ను ‘తల’ అని పిలవోద్దు, రాయొద్దు. అంతేకాదు నా పేరుకు ముందు తల మాత్రమే కాదు మరే ఇతర బిరుదులను జోడించకండి. ఒకవేళ నా గురించి రాయాల్సి వస్తే నన్ను అజిత్, అజిత్ కుమార్ లేదా ఏకే అని మాత్రమే పిలవండి. మీ అందరికీ మంచి ఆరోగ్యం, సంతోషం, విజయం, మనశ్శాంతి, సంతృప్తితో కూడిన అందమైన జీవితాన్ని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ అజిత్.. అని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన ఈ ప్రకటన ఇవ్వడానికి కారణమేంటో​ వెల్లడించలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!

దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌ల‌ను ఎంతో భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకున్నారు. ఎక్క‌డ చూసినా శ్రీ‌సీతారాముల క‌ల్యాణ ఉత్స‌వాల‌తో ఆధ్యాత్మిక శోభ…

Friday, 27 March 2026, 7:56 PM

గుర్తింపు కోసం మహిళలు ఇంకా ఎంత కష్టపడాలి? సమంత ఆవేదన.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ వేదికగా వ్యాఖ్యలు..

సినిమా ఇండ‌స్ట్రీలోనే కాకుండా అన్ని చోట్లా మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని, అనేక చోట్ల‌, వృత్తి జీవితంలోనూ వారు స‌ర్దుకుని పోవాల్సి…

Friday, 27 March 2026, 6:08 PM

ఐపీఎల్ 2026 కొత్త రూల్స్ ఇవే.. కెప్టెన్లకు బీసీసీఐ క్లాస్! ఆ నిబంధనలపై కఠినంగా..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో బీసీసీఐ జ‌ట్ల కెప్టెన్లు, అంపైర్లు, రిఫ‌రీల‌తో ఓ…

Thursday, 26 March 2026, 10:40 PM

ఐపీఎల్ 2026 ఫుల్ లీగ్ షెడ్యూల్ వచ్చేసింది.. మే 24 వరకు లీగ్ మ్యాచ్‌లు!

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌కు గాను బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను గురువారం (మార్చి 26, 2026) విడుద‌ల…

Thursday, 26 March 2026, 8:31 PM

చిరంజీవి, నాగబాబు నా అన్నయ్యలే.. ఇన్‌స్టా ఎంట్రీతో అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా బ‌య‌ట చాలా అరుదైన సందర్భాల్లో…

Thursday, 26 March 2026, 6:09 PM

‘ధురంధర్ 2’ రికార్డుల కోసం తిరుమల వెళ్లాల్సిందే.. సౌత్ సినిమాలపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

ధురంధ‌ర్ 2 సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో ఈ సినిమాను ఇప్ప‌టికే అనేక మంది సెల‌బ్రిటీలు…

Thursday, 26 March 2026, 3:43 PM

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో…

Wednesday, 25 March 2026, 7:17 PM

‘ధురంధర్ 2’ ఇండస్ట్రీ కళ్లు తెరిపించింది.. అమీషా పటేల్ సంచలన వ్యాఖ్యలు!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేస్తూ ఘ‌న విజ‌యం సాధించి ముందుకు సాగుతున్న…

Wednesday, 25 March 2026, 12:27 PM