OTT Apps : ఓటీటీ యాప్స్ న‌యా దోపిడీ.. స‌బ్‌స్క్రిప్ష‌న్ ఉన్నా.. సినిమాలు చూసేందుకు మ‌ళ్లీ డ‌బ్బులు క‌ట్ట‌డం ఏంటి..?

OTT Apps : నాలుగు డ‌బ్బులు వ‌స్తాయంటే స‌మాజంలో కొంద‌రు ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. అలాంటి వారు చాలా మందే ఉన్నారు. కానీ తాజాగా ఓటీటీ యాప్స్ కూడా ఇదే కోవ‌కు చెందుతాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే.. కొత్త కొత్త సినిమాలు వ‌స్తున్నాయి.. సిరీస్ లు ఉన్నాయి.. ఫీజు చెల్లించి స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోండి.. వాటిని చూసి ఎంజాయ్ చేయండి.. అని అదేప‌నిగా యాడ్స్ ఇస్తుంటారు. అంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 పుణ్య‌మా అని కాసుల‌కు కక్కుర్తి ప‌డి.. ఠాఠ్‌.. ఈ సినిమాలు చూడాలంటే.. డబ్బులు చెల్లించాల్సిందే.. అంటున్నాయి. మ‌రి ఇదేమిటి ? అంత డ‌బ్బు చెల్లించి నెల‌కో, 3 నెల‌లకో, ఏడాదికో స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవడం దేనికి ? అలా తీసుకోవాల‌ని ప్రేక్ష‌కుల వ‌ద్ద దేబిరించ‌డం దేనికి ?

ఓ వైపు స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తూనే.. తీసుకున్న త‌రువాత‌.. సినిమాల‌ను ఇలా వీడియో ఆన్ డిమాండ్ లేదా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో రిలీజ్ చేయడం దేనికి ? అంత మాత్రానికి స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల‌ని చెప్ప‌డం ఎందుకు ? సినిమాల‌న్నింటినీ అలా పే ప‌ర్ వ్యూ ప‌ద్ధతిలోనే ఓటీటీల్లో రిలీజ్ చేస్తే అయిపోతుంది క‌దా. ఇది నిజంగానే ఒక ర‌క‌మైన దోపిడీ అన్న భావ‌న ప్రేక్ష‌కుల్లో క‌లుగుతోంది.

OTT Apps

అస‌లే పెరిగిన టిక్కెట్ల ధ‌ర‌ల‌తో థియేట‌ర్ల‌కు వెళ్ల‌లేక ప్రేక్ష‌కులు ఓటీటీల‌కు అల‌వాటు ప‌డితే.. అక్క‌డ కూడా ఇలా రేట్లు పెట్టి మ‌రీ సినిమాల‌ను చూడాల‌ని ఆంక్ష‌లు పెడితే.. ఇంక వినోదం ఎక్క‌డి నుంచి ల‌భిస్తుంది ? అంత మాత్రానికి త‌మ ఓటీటీ యాప్ లలో ఖాతాను తీసుకోవాల‌ని ప్రచారం చేయ‌డం ఎందుకు ? తీసుకున్నాక సినిమాలు చూడాలంటే ఇలా డ‌బ్బులు చెల్లించాల‌ని అడ‌గడం దేనికి ? అంటే సినిమా పాపుల‌ర్ అయింది క‌నుక ప్రేక్ష‌కుల నుంచి ఇంకొన్ని డ‌బ్బుల‌ను పిండి వ‌సూలు చేయాల‌న్న‌దే భావ‌న క‌దా.. క‌నుకనే ఓటీటీ యాప్స్ ఇలా చేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీని వెనుక కార‌ణాలు ఏమున్నా.. ఇప్పుడు థియేట‌ర్ల‌కు వ‌చ్చిన టిక్కెట్ ధ‌ర‌ల పెంపు స‌మ‌స్య‌.. రేపు ఓటీటీల‌కు కూడా వ‌స్తుంది. వాటిని చూడ‌డం కూడా ప్రేక్ష‌కులు మానేస్తారు. దీనిపై ఓటీటీ యాప్స్ పున‌రాలోచ‌న చేసుకుంటే మంచిది. లేదంటే మొద‌టికే మోసం వ‌స్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM