Nivetha Thomas : కొందరు హీరోయిన్స్‌కి చాలా ధైర్యం ఉంటుంది. సాహసాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆఫ్రికాలోని టాంజానియాలో ఉన్న కిలిమంజారో శిఖరం ఎక్కి అందరూ నోరెళ్లబెట్టేలా చేసింది నివేదా థామస్. మంచుతో కప్పి ఉండే ఈ పర్వతం ప్రధాన శిఖరం కిబోను అందుకోవాలంటే 5,885 మీటర్లను అధిగమించాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితులు, బలమైన ఈదురుగాలులను ఎదుర్కొని నిల్చోవాల్సి ఉంటుంది.
చాలా సాహసంతో నివేదా థామస్ ఈ శిఖరాన్ని ఎక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉహురు పీక్ పాయింట్ వద్ద అమర్చిన డెస్టినేషన్ బోర్డు వద్ద ఫొటో దిగిన నివేదా థామస్ ఆ ఫొటోని తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. `ఐ మేడ్ ఇట్.. టు ద టూ ఆఫ్ ద టాలెస్ట్ ఫ్రీ స్టాండింగ్ మౌంటెయిన్ ఇన్ ద వరల్డ్.. మౌంట్ కిలిమంజారో..` అనే కామెంట్స్‌ను జత చేసింది.
కిలిమంజారో ట్రెక్కింగ్ కోసం నివేదా థామస్ సుమారు ఆరు నెలలుగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన కొంతమంది స్నేహితులతో కలిసి ఆమె ఈ ట్రెక్కింగ్‌ను కంప్లీట్ చేసిందని తెలుస్తోంది. ఈ బ్యూటీ ఇటీవల ‘వకీల్ సాబ్’ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిచింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో.. నివేదా ఓ కీలక పాత్రలో నటించి, మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘మీట్ క్యూట్’లో నటిస్తోంది. ఈ సినిమాలో నివేదా థామస్‌తోపాటు మరో నలుగురు హీరోయిన్స్ నటించబోతున్నారు.
మాతృత్వం ఒక మహిళ జీవితంలో అత్యంత మధురమైన దశగా భావించబడుతుంది. బిడ్డకు జన్మనిచ్చిన ఆనందం ఒక వైపు ఉంటే, మరోవైపు…
మెటాకు చెందిన ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్…
భారతీయ పోస్టల్ శాఖ 2026 సంవత్సరానికి గ్రామీణ డాక్ సేవక్ (GDS) నియామకాల అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ…
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…