Nivetha Pethuraj : యంగ్ హీరోతో నివేతా పేతురాజ్ సీక్రెట్ రిలేషన్.. ఆ బడా హీరో ఎవరంటే..?

September 23, 2022 1:36 PM

Nivetha Pethuraj : మెంటల్ మదిలో మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది నివేదా పేతురాజ్‌. డేరింగ్ లేడీ అనే పదానికి ఉదాహరణగా నివేదా పేతురాజ్‌ పేరు చెప్పేయొచ్చు. మొదటి నుంచీ నివేదా ఎంచుకునే సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టుల్లోనే ఉంటున్నాయి. కాన్సెప్ట్ బేస్‌తో పాటూ తన పాత్ర కూడా హైలైట్ అయ్యేలా చూసుకుంటుంది నివేదా పేతురాజ్. అందుకే చేసినవి తక్కువ సినిమాలే అయినా బాగా నోటెడ్ అయిపోయింది.

తెలుగుతో పాటూ తమిళ తదితర భాషల్లోనూ నివేదా పేతురాజ్ కి ఆఫర్స్ వస్తున్నాయి. బ్లడీ మేరీ సినిమాతో ఓటీటీని షేక్ చేసిన నివేదా పేతురాజ్ మరోసారి ఓటీటీ కంటెంట్‌కి సై అంటోందట. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో త్వరలోనే ఓటీటీ ఆడియన్స్‌కి మళ్లీ షాకిస్తానంటోంది నివేదా పేతురాజ్. ఇదిలా ఉండగా ఆమె నటించిన హీరోతో ప్రేమలో పడినట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నివేత పేతురాజ్ తెలుగు బడా ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోతో ఓ సినిమాలో కలిసి నటించింది.

Nivetha Pethuraj latest news about a hero going viral
Nivetha Pethuraj

ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. సినిమా రిలీజ్ అయి చాలా సంవత్సరాలు అవుతున్నా కానీ వీళ్ళ ప్రేమ ఇంకా బయటపడలేదని.. గుట్టు చప్పుడు కాకుండా సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నారని మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అన్నీ అనుకున్నట్టు జరిగితే నివేతా పేతురాజ్ బడా ఫ్యామిలీకి కోడలుగా రాబోతుంది అంటున్నారు సినీ వర్గాలు. చూడాలి మరీ వీళ్ళ ప్రేమ ఎప్పుడు బయట పడుతుందో.. పెద్దలు ఎప్పుడు వీరి పెళ్లిని అంగీకరిస్తారో.. మనకెప్పుడు ఈ వార్త తెలుస్తుందో.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now