Pooja Hegde : బుట్ట బొమ్మ పూజా హెగ్డెకు చూస్తుంటే ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు ఉంది. గతేడాది ఈమె నటించిన అన్ని చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా మొన్నటి వరకు టాప్ గేర్‌లో దూసుకుపోయింది. కానీ ఈమె నటించిన తాజా చిత్రాలు రెండూ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో పూజా హెగ్డెకు బెంగ పట్టుకున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ విషయం అలా ఉంచితే.. పూజా హెగ్డెను మాత్రం నెటిజన్లు మరో విషయంలో ట్రోల్ చేస్తున్నారు.
విజయ్, పూజా హెగ్డె జంటగా నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. సాక్షాత్తూ విజయ్ ఫ్యాన్సే సినిమా అస్సలు బాగా లేదని.. ఏకంగా థియేటర్‌లో తెరకు నిప్పు పెట్టారంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా రెండు వరుస ఫ్లాప్‌లతో పూజా హెగ్డె విచారంలో ఉంది. దీనికి పుండు మీద కారం చల్లినట్లుగా మరోవైపు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
నిజానికి బీస్ట్ చిత్రంలో పూజా హెగ్డె హీరోయిన్ అయినప్పటికీ.. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత కల్పించలేదనే చెప్పాలి. విజయ్ చేసే యాక్షన్‌ను చూస్తూనే ప్రేక్షకులు సినిమాను వీక్షించాలని అనుకున్నారు కాబోలు.. పూజా హెగ్డె క్యారెక్టర్‌కు అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది. అయితే ఇంత మాత్రానికే పూజా హెగ్డె సినిమా ప్రమోషన్లలో అంత హడావిడి చేయడం అవసరమా.. అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసింది.. అసలు సినిమాలో ఆమె మాకు కనిపించనే లేదు.. అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. రాధేశ్యామ్, బీస్ట్ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఇక పూజా హెగ్డె తన తదుపరి చిత్రం ఆచార్యపైనే హోప్స్ పెట్టుకుంది. మరి ఈ మూవీ అయినా ఆమెను రక్షిస్తుందో.. లేదో.. చూడాలి.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…