Nayanthara : న‌య‌న‌తార‌పై నెటిజ‌న్ల ఆగ్ర‌హం.. అత‌న్ని పెళ్లికి ఎందుకు పిలిచావంటూ ఫైర్‌..!

June 15, 2022 7:50 PM

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరుగాంచిన న‌య‌న‌తార‌, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ ఎన్నో ఏళ్ల త‌మ ప్రేమ బంధానికి ముగింపు ప‌లికి ఇటీవ‌లే పెళ్లి చేసుకున్న విష‌యం విదిత‌మే. జూన్ 9వ తేదీన వీరు మ‌హాబ‌లిపురంలోని గ్రాండ్ షెర‌టాన్ హోట‌ల్‌లో అంగ‌రంగ‌వైభ‌వంగా వివాహం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వీరు ఆ ఒక్క రోజు త‌మిళ‌నాడులోని సుమారు 1 ల‌క్ష మంది పేద‌ల‌కు అన్న‌దానం చేసి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. అయితే వీరి పెళ్లికి ఎంతో మంది ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. కానీ ఒక్క వ్య‌క్తిని మాత్రం పెళ్లికి ఎందుకు పిలిచావంటూ న‌య‌న‌తార‌పై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

మ‌ళ‌యాళ న‌టుడు దిలీప్ కుమార్ గురించి తెలుగు ప్రేక్ష‌కులు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. కానీ త‌మిళం, మ‌ళ‌యాళం ప్రేక్ష‌కుల‌కు బాగానే తెలుసు. అయితే అప్ప‌ట్లో ఇత‌నిపై హీరోయిన్ భావ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న సోద‌రుడితో క‌లిసి దిలీప్ కుమార్ త‌న‌పై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడ‌ని భావ‌న ఆరోప‌ణ‌లు చేసింది. అయితే అలాంటి వ్య‌క్తిని నీ పెళ్లికి ఎందుకు పిలిచావు.. అత‌న్ని పిల‌వాల్సిన అవ‌స‌రం ఏముంది.. అంటూ న‌య‌న‌తార‌ను ప్ర‌శ్నిస్తూ.. ఆమెపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యం సోష‌ల్ మీడియాలోనూ వైర‌ల్ అవుతోంది.

netizen angry on Nayanthara for Dileep Kumar attendance
Nayanthara

ఇక న‌య‌న‌తార ఇటీవలే భ‌ర్త విగ్నేష్‌తో క‌ల‌సి తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకుంది. అయితే మాడ వీధుల్లో వీరు చెప్పులు ధ‌రించి తిర‌గ‌డం వివాదాస్ప‌దం అయింది. దీంతో వారిని టీటీడీ వివ‌ర‌ణ కోరింది. ఈ క్ర‌మంలోనే న‌య‌న్‌, విగ్నేష్ దంప‌తులు టీటీడీకి లిఖిత పూర్వ‌కంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో ఈ వివాదం స‌ద్దుమ‌ణిగింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment