Nayanthara : న‌య‌న‌తార పెళ్లి ఫిక్స్‌.. ఎప్పుడు.. ఎక్క‌డ అంటే..?

Nayanthara : లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌నతార‌, ఆమె బాయ్ ఫ్రెండ్, ద‌ర్శ‌కుడు విగ్నేష్ శివ‌న్ గ‌త కొంత కాలంగా పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగిపోయిన సంగతి తెలిసిందే. వీరు ప‌లు సంద‌ర్భాల్లో ఒక‌రికొక‌రు ఐ ల‌వ్ యూ చెప్పుకోవ‌డ‌మే కాక‌.. చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కూడా. వీరు గ‌త 4 ఏళ్లుగా స‌హ‌జీవ‌నం కూడా చేస్తున్నారు. అయితే వీరిద్ద‌రూ ఇప్ప‌టికే ఎన్నో ఆల‌యాలు తిరిగారు. ఒక ఆల‌యంలో అయితే న‌య‌న‌తార నుదుటిపై సింధూరం పెట్టుకుని క‌నిపించింది. సాధార‌ణంగా హిందూ సంప్ర‌దాయంలో పెళ్ల‌యిన స్త్రీలు మాత్ర‌మే అలా నుదుటిపై సింధూరం ధ‌రిస్తారు. దీంతో అంద‌రిలోనూ అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. వీరిద్ద‌రూ ఇప్ప‌టికే వివాహం చేసుకుని ఉంటార‌ని.. కానీ అది బ‌య‌ట‌కు తెలియ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నార‌ని.. ఏదో గ్ర‌హ దోషం ఉండ‌డం వ‌ల్లే ఇలా చేస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే వారిద్ద‌రికీ ఇదివ‌ర‌కే వివాహం అయింద‌న్న విష‌యం అబ‌ద్ధ‌మ‌ని తెలుస్తోంది. ఎందుకంటే వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్నారు మ‌రి.

Nayanthara

న‌య‌న‌తార‌, విగ్నేష్ శివ‌న్‌లు త‌మ ప్రేమ బంధానికి స్వ‌స్తి చెప్పి త్వ‌ర‌లో పెళ్లి బంధంతో ఒక్క‌ట‌వనున్నార‌ని తెలుస్తోంది. వీరు జూన్ 9న పెళ్లి చేసుకోనున్నార‌ని స‌మాచారం. ఓ త‌మిళ మీడియా సంస్థ ప్ర‌చురించిన క‌థ‌నం ప్ర‌కారం.. వీరు ఆ తేదీన తిరుమ‌ల‌లో వివాహం చేసుకోనున్నార‌ని తెలుస్తోంది. కేవ‌లం కొద్ది మంది స్నేహితులు, కుటుంబ స‌భ్యుల న‌డుమ వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం. అయితే వివాహం అయ్యాక రిసెప్ష‌న్‌ను మాత్రం చాలా గ్రాండ్‌గా ఏర్పాటు చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఏకంగా మాల్దీవ్స్‌లో వీరు త‌మ రిసెప్ష‌న్‌ను ఏర్పాటు చేస్తార‌ని తెలుస్తోంది. దానికి ఆయా భాష‌ల‌కు చెందిన ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌కు వీరు ఆహ్వానాలు పంపించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే న‌య‌న‌తార, విగ్నేష్ శివ‌న్‌ల పెళ్లికి సంబంధించిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

కాగా ఈ ఇద్ద‌రూ గ‌తంలో అనేక ఆల‌యాల‌కు తిరిగారు. అనేక సార్లు పూజ‌లు చేశారు. న‌య‌న‌తార జాత‌కంలో దోషం ఉంద‌ని.. క‌నుకనే ఇన్ని రోజుల‌పాటు పూజ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. కాబ‌ట్టే ఇప్ప‌టి వ‌ర‌కు వారు పెళ్లి చేసుకోకుండా ఉన్నార‌ని.. ఇక స‌రైన స‌మ‌యం వ‌చ్చింది క‌నుక‌నే పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో ఎట్ట‌కేల‌కు ఈ జంట ఒక్క‌టి కానుంది. అయితే ప్ర‌స్తుతానికి ఇది వైర‌ల్ అవుతున్న స‌మాచార‌మే. దీనిపై వారు ఇంకా ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త్వ‌ర‌లో ఏమైనా చెబుతారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ…

Saturday, 21 March 2026, 6:09 PM

సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!

అప్ప‌ట్లో బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్‌ఖాన్‌తో క‌లిసి ల‌క్కీ సినిమా చేసిన స‌మ‌యంలో చిత్ర షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు ఆయ‌న త‌న ప‌ట్ల…

Friday, 20 March 2026, 9:29 PM

రష్మికకు ‘గద్దర్’ అవార్డు.. రేవంత్ రెడ్డి, రామ్ చరణ్ చేతుల మీదుగా! ట్రోల్స్‌కు అదిరిపోయే రిటార్ట్.

టాలీవుడ్ న‌టుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇటీవ‌లే వివాహం చేసుకున్న క‌న్న‌డ న‌టి ర‌ష్మిక మంద‌న్న‌కుతెలంగాణ గద్ద‌ర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో…

Friday, 20 March 2026, 7:49 PM

ఆ డాక్టర్లు డబ్బులిస్తామన్నా వద్దన్నా.. అనుపమ్ ఖేర్ ‘బట్టతల’ వెనుక అసలు రహస్యం!

హెయిర్ వీవింగ్ కంపెనీలు, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ డాక్ట‌ర్లు త‌న‌కు డ‌బ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌ని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకోవాల‌ని త‌ర‌చూ…

Thursday, 19 March 2026, 10:23 PM

చదువులో 80 రాలేదు.. కానీ కెప్టెన్‌గా 80% సక్సెస్! సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

స్కూల్‌, కాలేజీల్లో చ‌దివిన‌ప్పుడు ఎన్న‌డూ 80 శాతం మార్కుల‌ను దాట‌లేక‌పోయాన‌ని, కానీ భార‌త టీ20 జ‌ట్టు కెప్టెన్‌గా 80 శాతానికి…

Thursday, 19 March 2026, 6:36 PM

అనుష్క పెళ్లి వార్తలపై టీమ్ సీరియస్.. ఆ వార్తల్లో నిజం లేదు! ప్రచారం ఆపండి..

తాను పెళ్లి చేసుకోబోతున్నాన‌ని మీడియాతోపాటు సామాజిక మాధ్య‌మాల్లో వ్యాప్తి చెందుతున్న వార్త‌ల‌ను న‌టి అనుష్క శెట్టి ఖండించింది. ఈ మేర‌కు…

Thursday, 19 March 2026, 3:38 PM

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ…

Thursday, 19 March 2026, 11:09 AM

జడేజా దంపతుల కాళ్లకు మొక్కిన కుల్దీప్ యాదవ్.. లక్నో రిసెప్షన్‌లో ‘సంస్కారం’ చాటుకున్న స్పిన్నర్!

భార‌త క్రికెట్ జ‌ట్టు రిస్ట్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ త‌న బాల్య స్నేహితురాలు వంశికా చ‌ద్దాను వివాహం చేసుకున్న నేప‌థ్యంలో…

Wednesday, 18 March 2026, 8:13 PM