Nayanthara : కోలీవుడ్ క్రేజీ కపుల్ నయనతార, విగ్నేష్ శివన్ కొన్నాళ్లుగా తెగ వార్తలలో నిలుస్తూ వస్తున్నారు. నయన్.. శింబు, ప్రభుదేవాలకి బ్రేకప్ చెప్పాక విగ్నేష్ శివన్ ప్రేమలో పడింది. ఇక అప్పటి నుండి అతనితోనే సన్నిహితంగా ఉంటూ తెగ చక్కర్లు కొడుతోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ నయనతార. ప్రస్తుతం నయనతార పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే నయనతార పెళ్లికి సంబంధించి కొన్నాళ్లుగా అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇటీవల ఈ జంట సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారనే వార్తలు కూడా వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
తాజాగా విగ్నేష్ శివన్, నయనతార జంట మైలాపూర్ లోని శ్రీ సాయిరాం టెంపుల్ ని సందర్శించారు. దీంతో గుడి వద్ద జనసందోహంగా మారింది. విగ్నేష్ శివన్, నయనతార ఇద్దరూ చేతిలో పూల మాలలతో కనిపించారు. దీనితో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలంగా ఈ ఇద్దరూ కలిసి కట్టుగా పుణ్య క్షేత్రాలు, విహార యాత్రలకు వెళుతున్నారు. వీరిద్దరూ బయట కనిపిస్తే చాలు.. అభిమానులకి ఎన్నో అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. తాజాగా నయనతార తన జాతకం ప్రకారం పలు ఆలయాల్లో పూజలు చేయించుకుంటోందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ పూజలన్నీ పూర్తయ్యాక విగ్నేష్ శివన్, నయన్ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం నయనతార.. విగ్నేష్ శివన్ దర్శకత్వంలోనే కణ్మణి రాంబో ఖతీజా అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మరో హీరోయిన్ గా సమంత నటిస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అతి త్వరలో విడుదల కానున్న ఈ సినిమా రీసెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకుంది. సెట్‌లో సమంత చేసిన సందడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…