గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Natu Natu Song : ఊర‌మాస్ మామా.. ట్రాఫిక్‌లో హెల్మెట్ పెట్టుకొని డ్యాన్స్‌తో ర‌ఫ్ఫాడించాడుగా..!

Natu Natu Song : రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రో రెండు నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తున్నారు. ముందుగా దోస్తీ అనే…

Natu Natu Song : ఊర‌మాస్ మామా.. ట్రాఫిక్‌లో హెల్మెట్ పెట్టుకొని డ్యాన్స్‌తో ర‌ఫ్ఫాడించాడుగా..!

Natu Natu Song : రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రో రెండు నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా మూవీ నుండి ఒక్కో సాంగ్ విడుద‌ల చేస్తున్నారు. ముందుగా దోస్తీ అనే సాంగ్ విడుద‌ల చేయగా, దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక రీసెంట్‌గా నాటు నాటు అనే సాంగ్ విడుద‌ల చేశారు. కీరవాణి స్వరపరిచిన ఈ సాంగ్ కి కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అద్భుతమైన స్టెప్స్ అందించారు.

Natu Natu Song man danced for this song in traffic viral video

టాలీవుడ్ టాప్ డాన్సర్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటు సాంగ్‌కి మెరుపు వేగంతో ఒక్కసారిగా కాళ్లు కదపగా.. ఈ సాంగ్ బాగా వైరల్ అయ్యింది. ఈ పాటకున్న క్రేజ్ నేపథ్యంలో పలువురు నాటు నాటు సాంగ్ లోని హీరోల స్టెప్స్ ను అనుకరిస్తూ కవర్ సాంగ్స్ చేస్తున్నారు. ఓ బామ్మ ఇదే సాంగ్‌కి డ్యాన్స్ వేసి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. ఇక రీసెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోహైల్, మెహబూబ్ నాటు నాటు సాంగ్ కి తమదైన రీతిలో డాన్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ గుర్తుకు వచ్చేలా అద్భుతంగా స్టెప్స్ వేశారు.

తాజాగా ఓ వ్య‌క్తి ఓ వ్యక్తి బైక్‌పై వెళుతున్నాడు.. అదేసమయంలో ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడింది. తలకు హెల్మెట్‌ ధరించిన ఆ వ్యక్తి బైక్‌ నుంచి దిగి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశాడు. దీంతో అక్కడున్న వారంతా ఈ సీన్‌ కు తొలుత షాక్‌కి గురయ్యారు. కానీ తర్వాత విషయం తెలుసుకొని తమ మొబైల్‌ ఫోన్‌ను తీసి వీడియో తీయడం ప్రారంభించారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియో కాస్తా ఆర్‌ఆర్‌ఆర్‌ మేకర్స్‌ దృష్టిలో పడింది. దీంతో ఈ వీడియోను రీట్వీట్ చేసిన చిత్ర యూనిట్‌ ‘మాస్‌’ అనే క్యాప్షన్‌ ను జోడించింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి