గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mohan Babu : నన్ను చాలా మంది మోసం చేశారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 70వ పుట్టినరోజు వేడుకలను శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల కోసం పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మోహన్…

Mohan Babu : నన్ను చాలా మంది మోసం చేశారు.. మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు..

Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 70వ పుట్టినరోజు వేడుకలను శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థలలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ పుట్టినరోజు వేడుకల కోసం పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ పుట్టినరోజు సందర్భంగా మోహన్ బాబు వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ తన గురువు దాసరి నారాయణరావుని తలుచుకున్నారు. దాసరి నారాయణరావు గురించి మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో కష్టాల గురించి ఈ వేదికపై మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

Mohan Babu said he is cheated by so many persons
Mohan Babu

తన జీవితమంతా కష్టాలతోనే కొనసాగిందని జీవితం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నానని మోహన్ బాబు వెల్లడించారు. కేవలం రెండు జతల బట్టలతో తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చి ఒక కారు షెడ్ లో ఉన్నానని సుమారు ఏడు సంవత్సరాల పాటు సరైన తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డానని మోహన్ బాబు ఈ సందర్భంగా తెలిపారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో తనని ఎంతోమంది తమ స్వార్థం కోసం ఉపయోగించుకున్నారని ఇలా చాలా మంది చేతిలో తాను మోసపోయానని మోహన్ బాబు తెలిపారు.

అలాగే తాను కష్టాల్లో ఉన్న సమయంలో ఏ ఒక్కరూ తనని ఆదుకోలేదని తనకు సహాయం చేయలేదని తెలిపారు. జీవితమంటేనే ఒక నాటకం అని తన గురువు దాసరి ఎప్పుడూ చెప్పే వారని ఆయన మాటలను గుర్తు చేసుకున్నారు. ఇక తన జీవితంలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ కష్టాలే ఉన్నాయని.. ఆ కష్టాలు తన బిడ్డలకే కాకుండా ఏ ఒక్కరికీ రాకూడదని ఈ సందర్భంగా మోహన్ బాబు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి