గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mohan Babu : విష్ణు వ‌ద్ద‌న్నాడు.. నేనే ఆ సీన్లు పెట్టించాను: మోహ‌న్ బాబు

Mohan Babu : ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈ నెల 18వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి…

Mohan Babu : విష్ణు వ‌ద్ద‌న్నాడు.. నేనే ఆ సీన్లు పెట్టించాను: మోహ‌న్ బాబు

Mohan Babu : ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్ బాబు ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం.. స‌న్ ఆఫ్ ఇండియా. ఈ మూవీ ఈ నెల 18వ తేదీన థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను తాజాగా నిర్వ‌హించారు. అలాగే మోహ‌న్ బాబు త‌న సినిమా గురించి, ప్ర‌స్తుతం ఉన్న రాజ‌కీయాల గురించి మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయ‌న ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Mohan Babu  said he insisted to put some scenes Vishnu denied them
Mohan Babu

స‌న్ ఆఫ్ ఇండియా మూవీ గురించి మోహ‌న్ బాబు మాట్లాడుతూ.. డైమండ్ ర‌త్న‌బాబు క‌థ చెప్ప‌గానే వెంట‌నే న‌చ్చి ఓకే చేశాన‌ని, ఇందులో కొంత రిస్క్ ఉంద‌ని, అయిన‌ప్ప‌టికీ సాహ‌సం చేశామ‌ని తెలిపారు. ఇక మంచు విష్ణు ఈ చిత్రానికి నిర్మాత అని అన్నారు. ఈ మూవీలో అమ్మాయిల మ‌ధ్య లిప్ లాక్ సీన్లు పెట్టాల్సి వ‌చ్చింద‌ని.. అయితే విష్ణు అందుకు ఒప్పుకోలేద‌ని అన్నారు. మ‌న‌ది ప‌రువు ప్ర‌తిష్ట‌లు ఉన్న కుటుంబం, పైగా తాను మా అధ్య‌క్షుడు. నిర్మాత‌గా ఉండి ఈ సినిమా తీశాడు. ఇలాంటి సినిమాలో ముద్దు సీన్లు పెడితే అన‌వ‌స‌రంగా వివాదాల‌కు తావు ఇచ్చిన‌ట్లు అవుతుంద‌ని.. విష్ణు అన్నాడ‌ని.. మోహ‌న్ బాబు తెలిపారు.

అయితే క‌థ డిమాండ్ చేసింది క‌నుక లిప్ లాక్ సీన్లు పెట్ట‌వ‌చ్చు, ఏమీ కాద‌ని.. తాను విష్ణుకు న‌చ్చ‌జెప్పాన‌ని అన్నారు. ఇక ఈ మూవీలో.. ఒక ఎమ్మెల్యే వ‌ల్ల జీవితం నాశ‌నం అయిన వ్య‌క్తి జైలు నుంచి త‌ప్పించుకుని బ‌య‌ట‌కు వ‌చ్చి ఏం చేశాడ‌న్న‌ది.. చూపించామ‌ని.. మిగిలిన క‌థ కోసం సినిమా చూడాల‌ని అన్నారు. దీన్ని ముందుగా ఓటీటీల‌కే ఇవ్వాల‌ని అనుకున్నామ‌ని, కానీ థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నామ‌ని, త‌రువాత ఓటీటీల్లోనూ వ‌స్తుంద‌ని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి